BJP OUT MANIFESTO: బీజేపీ బొమ్మ మాయం.. కూటమి మేనిఫెస్టో బీజేపీకి ఇష్టం లేదా..?

బీజేపీ జాతీయ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నప్పటికీ.. మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ఆయన ముందుకు రాలేదు. కాపీ ఇస్తున్నా.. తీసుకోవడానికి నిరాకరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత అరుణ్ సింగ్ రావాల్సి ఉన్నా ఆయన గైర్హాజరు అయ్యారు.

  • Written By:
  • Updated On - April 30, 2024 / 05:39 PM IST

BJP OUT MANIFESTO: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. చంద్రబాబు నాయుడు నివాసంలో ఆవిష్కరించిన ఈ మేనిఫెస్టో కార్యక్రమానికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దూరంగా ఉన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నప్పటికీ.. మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ఆయన ముందుకు రాలేదు. కాపీ ఇస్తున్నా.. తీసుకోవడానికి నిరాకరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత అరుణ్ సింగ్ రావాల్సి ఉన్నా ఆయన గైర్హాజరు అయ్యారు.

TDP Janasena Manifesto: టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల.. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం!

దాంతో ఈ మేనిఫెస్టోకి టీడీపీ, జనసేన మాత్రమే బాధ్యత వహిస్తాయా.. బీజేపీకి సంబంధం లేదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. జనరల్‌గా బీజేపీ ఉచిత హామీ పథకాలకు దూరంగా ఉంటుంది. జాతీయ స్థాయిలో కూడా ఉచితాలను ఆ పార్టీ ప్రకటించలేదు. అందుకే ఏపీలో అమలుకు సాధ్యం కాని హామీలను కూటమిలోని రెండు పార్టీలు ఇవ్వడంతో.. బీజేపీ తమకు సంబంధం లేదని నిర్మొహమాటంగా బాబు, పవన్‌కి చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. మేనిఫెస్టోపై ప్రధాని మోడీ ఫోటో పెట్టొద్దని బీజేపీ హైకమాండ్ చెప్పినట్టు సమాచారం. అందుకే అప్పటికప్పుడు మేనిఫెస్టోపై ప్రధాని ఫోటో తొలగించి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫోటోలు మాత్రమే కమిటీ ప్రింట్ చేయించినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్ళూ కూటమి మేనిఫెస్టో ఉంటుందని ప్రచారం చేసుకున్నారు నేతలు. కానీ ఇప్పుడు బీజేపీ దూరం జరగడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తమ పార్టీకి జాతీయ స్థాయిలోనే తప్ప.. స్థానిక మేనిఫెస్టోలు ఉండవని బీజేపీ నేతలు చెబుతున్నారు. మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఈ పథకాల అమలు బాధ్యతను టీడీపీ, జనసేన తీసుకుంటాయని చెప్పారు చంద్రబాబు నాయుడు.

కేంద్రంలో బీజేపీ మద్దతు ఉంటుందని అన్నారు. సిద్ధార్థ్ నాథ్ సింగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అత్యంత నమ్మకస్తుడు. ఏపీ రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు బీజేపీ అధిష్టానానికి రిపోర్ట్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తి మేనిఫెస్టో బుక్ తీసుకోడానికి నిరాకరించడం ఏంటని డౌట్స్ వస్తున్నాయి. మేనిఫెస్టో కోసం కట్టిన బ్యానర్‌లో కూడా ఎక్కడా ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ఫోటోలు లేవు. దాంతో కావాలనే ఏపీలో టీడీపీ, జనసేన మేనిఫెస్టోకి బీజేపీ దూరంగా ఉందన్న అనుమానాలు తలెత్తెతుతున్నాయి.