Annamalai: అన్నామలై.. దేశమంతా చర్చించుకుంటున్న పేరు ఇది. ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరి.. తమిళనాట కమలం పార్టీని పరుగులు పెట్టిస్తున్న ఒకే ఒక్కడు. దక్షిణాదిని టార్గెట్ చేసిన బీజేపీకి.. తమిళనాడులో అన్నామలై కారణంగా ఆశలు చిగురిస్తున్నాయ్. సోషల్ మీడియాలో అన్నామలైకి ఉన్న క్రేజే వేరు. ఆయన సింప్లిసిటీ, ఇన్‌స్పైరింగ్ స్పీచ్‌లకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తమిళనాడులో ఆయన ఎక్కడ పర్యటించినా.. జనాల నుంచి వస్తున్న స్పందన మాములుగా ఉండటం లేదు. ఎన్‌మన్, ఎన్‌మక్కల్ పేరుతో అన్నామలై చేపట్టిన పాదయాత్రకు.. తమిళ యూత్, జనాల్లో విపరీత స్పందన కనిపించింది.
MLC KAVITHA: కవితకు మరో షాక్.. బెయిల్ ఇవ్వలేమన్న కోర్టు..
ఇక ఆ మధ్య తమిళనాడులో సభ ఏర్పాటు చేసినప్పుడు.. అన్నామలై మైక్ అందుకోగానే జనాల నుంచి కనిపించిన క్రేజ్ చూసి మోదీ కూడా షాక్ అయిపోయాడు. అసలు బీజేపీకి అడ్రస్ లేదు అనుకునే తమిళనాడులో.. డీఎంకే, అన్నాడీఎంకే నేతలు అన్నామలైని టార్గెట్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో 39 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కమలం పార్టీ భారీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 3నుంచి 5 ఎంపీ స్థానాలు వస్తాయని ఒపీనియన్ పోల్స్ చెప్తుండడంతో.. బీజేపీ జోష్‌కు హద్దుల్లేకుండా పోతున్నాయ్. ఇక అటు ఈ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి అన్నామలై పోటీ చేయబోతున్నారు. ఇక్కడి నుంచే ఆయన బరిలో దిగడం వెనక భారీ కారణాలు కనిపిస్తున్నాయ్. కోయంబత్తూర్‌తో బీజేపీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 1998లో బీజేపీ అగ్రనేత అద్వానీ టార్గెట్‌గా కోయంబత్తూర్ బాంబు పేలుళ్లు జరిగాయ్. దీని తర్వాత మతపరంగా ఇక్కడ ఓట్లు పోలరైజ్ అవుతున్నాయ్.
తమిళనాడులో పర్యటించిన మోదీ.. కోయంబత్తూరు పేలుళ్లను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు కూడా ! ఇక ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఓటర్లు కూడా ఎక్కువ. వస్త్ర పరిశ్రమలో ఉత్తరాది నుంచి వచ్చి పనులు చేసేవారు చాలామంది ఉన్నారు. వారిలో చాలామంది ఇక్కడే సెటిలయ్యారు కూడా ! వీటన్నింటికి మించి ఇదే ప్రాంతానికి చెందిన ఆధ్యాత్మిక గురువు సద్గురు ఆశీస్సులు కూడా అన్నామలైకి ఉన్నాయ్. ఎలా చూసినా.. అన్నామలై విజయాన్ని ఎవరూ ఆపలేరు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. బీజేపీ టార్గెట్ కూడా అన్నామలైని పార్లమెంట్‌లోకి తీసుకురావడమే.