పుష్ప (Pushpa) మూవీతో పాన్ ఇండియా (Pan India) హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక.. ఆ తర్వాత యానిమల్ సినిమాతో మరింత ఫేమస్ అయింది. బాలీవుడ్ (Bollywood) నుంచి టాలీవుడ్ (Tollywood) వరకు అమ్మడు ఫాలోయింగ్ మాములుగా లేదు. ఓ రెండు మూడేళ్ల వరకు శ్రీవల్లి డేట్స్ ఖాళీ లేవ్ అంటే అర్థం చేసుకోవచ్చు.. ఎంత బిజీ అయిందని! పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన రష్మికను.. బీజేపీ తమకు అనుకూల ప్రచారం కోసం వాడుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య ట్విట్టర్‌లో రష్మిక ఓ వీడియో పోస్ట్ చేసింది.
బీజేపీ (BJP) హయాంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని.. మేల్కొండి అభివృద్ధికి ఓటు వేయండి అంటూ చెప్పుకొచ్చింది. ఐతే ఈ వీడియో రష్మిక ఫ్రీగా ఏమీ చేయలేదట. ఈ ఒక్క వీడియోకు ఏకంగా 10కోట్లు ముట్టాయంటూ.. ఫేమస్ మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్.. ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. జనాల డబ్బులను ఇలా లూఠీ చేస్తారా.. షేమ్ ఆన్ యూ అంటూ.. ఉమైర్ రాసుకొచ్చాడు. ఎలక్షన్ టైమ్ కావడంతో.. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్‌పై ట్రావెల్ చేస్తూ.. ఆమె ఈ వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. జనాల జీవితాలను మెరుగుపరచడం కంటే.. సంతృప్తికరమైనది మరొకటి ఉండదంటూ.. రిప్లై ఇచ్చారు. దేశ అభివృద్ధిని, బీజేపీ ప్రభుత్వాన్ని రష్మిక పొగడటం… ఆ పొగడ్తకు ప్రధాని నేరుగా బదులివ్వడం… ఆయనకు హీరోయిన్ థ్యాంక్స్ చెప్పడం.. ఇవన్నీ ఓ ఎపిసోడ్‌లాగా కనిపించాయ్. అయితే ఇదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని నెటిజన్లు అంటున్నారు. అంతే కాదు.. రష్మిక వీడియోని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఉమైర్ సంధు 10కోట్ల ఆఫర్ అంటూ ట్వీట్ వేయడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.