LK Advani, Bharat Ratnam : ఎల్ కే అద్వానీకి భారత రత్న

బీజేపీ (BJP) అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్ కె అద్వానీకి భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం... భారతరత్న(Bharat Ratnam) లభించింది. ప్రధాని నరేంద్రమోడీ (Prime Minister Narendra Modi) X లో ఈ విషయం తెలిపారు. అద్వానీకి స్వయంగా శుభాకాంక్షలు తెలిపానన్న మోడీ... దేశాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారని ట్వీట్ చేశారు.

బీజేపీ (BJP) అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్ కె అద్వానీకి భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం… భారతరత్న(Bharat Ratnam) లభించింది. ప్రధాని నరేంద్రమోడీ (Prime Minister Narendra Modi) X లో ఈ విషయం తెలిపారు. అద్వానీకి స్వయంగా శుభాకాంక్షలు తెలిపానన్న మోడీ… దేశాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారని ట్వీట్ చేశారు. బీజేపీని స్థాపించిన దగ్గర నుంచి అధికారంలోకి తీసుకొచ్చేవరకూ అద్వానీ ఎంతో శ్రమించారు. ఉపప్రధాని (Deputy Prime Minister) పదవితో పాటు కేంద్ర హోంమంత్రిగా ఇతర హోదాల్లోనూ ఆయన పనిచేశారు. ప్రధాని పదవిలో కూర్చోవాలన్న అద్వానీ కల నెరవేరకపోయినా… అయోధ్యలో రామమందిరం (Ayodhya Ram Mandir) నిర్మించాలన్న కోరిక మాత్రం నెరవేరింది.

జనవరి 22నాడు అయోధ్యలో రామమందిరంలో బాలక్ రామ్ ప్రాణప్రతిష్ట (Balak Ram Pranapritsha) జరిగిన రోజున… ప్రపంచంలోని హిందువులందరికీ ఎల్ కే అద్వానీని తప్పకుండా గుర్తుకొచ్చారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగాలని… 1990లో ఎల్ కే అద్వానీ రథయాత్ర చేపట్టడం వల్లే ప్రస్తుతం సాధ్యమైంది. అప్పట్లో దేశవ్యాప్తంగా అల్లర్లు, అద్వానీని అరెస్ట్ చేయడం… ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. చివరకు మందిరం నిర్మాణంతో అద్వానీ చేసిన పోరాటం విజయవంతమైంది. ఇదే టైమ్ లో దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం మోడీ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. మోడీ ప్రధాని అయ్యాక… బీజేపీలో సీనియర్లను పట్టించుకోవడం లేదన్న విమర్శలకు చెక్ పెట్టడానికే అద్వానీకి భారతరత్న ప్రకటించినట్టు తెలుస్తోంది.

1927లో భారత్ విభజన కాకముందు పాకిస్తాన్ (Pakistan) లోని కరాచీలో పుట్టిన అద్వానీ.. 1947లో RSS కరాచీ విభాగం కార్యదర్శిగా పనిచేశారు. దేశ విభజన తర్వాత ఇండియాకు వచ్చిన ఆయన RSS లో వివిధ విభాగాల్లో పనిచేశారు. 1973నుంచి 76 వరకూ జన్ సంఘ్ అధ్యక్షుడిగా అద్వానీ ఎన్నికయ్యారు. 1970 నుంచి 2019 వరకూ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీదే కీలకపాత్ర. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగాలంటూ రధయాత్ర చేశారు. దాంతో దేశంలోని హిందువుల్లో చాలామంది బీజేపీ వైపు టర్న్ అయ్యారు. అప్పటి దాకా పార్లమెంట్ లో ఎక్కడో ఒకటీ అరా సీట్లు ఉన్న బీజేపీ అధికారం చేపట్టేదాకా పవర్ ఫుల్ గా ఎదిగింది. అందుకు అద్వానీయే కారణం. వాజ్ పేయి ప్రభుత్వంలో డిప్యూటీ పీఎం గా పనిచేశారు అద్వానీ.

2014 ఎన్నికల్లో ఎల్ కే అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషీ కూడా బీజేపీ ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. మోడీ, అమిత్ షా ద్వయం శకం ప్రారంభం అయ్యాక… ఎల్ కే అద్వానీ, జోషి లాంటి నేతలకు బీజేపీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత మోడీ హయాంలో బీజేపీ మరింత బలపడటం, రెండు సార్లు అధికారంలోకి రావడం జరిగాయి. అద్వానీ యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా… ఆయన లాంటి సీనియర్ల సలహాలను మోడీ తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. రామమందిరం నిర్మాణం తర్వాత… దేశమంతా అద్వానీని గుర్తు చేసుకుంటున్న ఈ టైమ్ లో ఆయనకు భారతరత్న ప్రకటించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. బిహార్ మాజీ సీఎం దివంగత నేత కర్పూరి ఠాకూర్ కు భారతరత్నను 10 రోజుల క్రితమే అనౌన్స్ చేసింది. ఇప్పుడు అద్వానీకి ఇస్తున్నట్టు మోడీ తెలిపారు. దేశంలో ఇప్పటివరకూ 49 మంది ప్రముఖులు భారత రత్న అందుకున్నారు. వీళ్ళల్లో 17 మందికి మరణానంతరం లభించింది.