DOWRY REJECTED: రూపాయి కట్నం తీసుకున్న బీజేపీ లీడర్‌..

వరకట్నం మీద ప్రచారం కల్పించడానికి.. ఓ బీజేపీ నేత చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ఒక్క రూపాయి కట్నం తీసుకుని.. తన కొడుకు పెళ్లి చేశాడు ఓ బీజేపీ నేత. ఈ ఆదర్శ వివాహం హర్యానాలో జరిగింది.

  • Written By:
  • Publish Date - February 20, 2024 / 07:31 PM IST

DOWRY REJECTED: ఈకాలంలో పెళ్లిళ్లు అంటే ఎంత కాస్ట్‌లీ అయ్యాయో తెలిసిందే కదా! కట్నాలు, కానుకలు అంటూ.. ఆడపిల్ల ఇంటి తరఫు వారికి తడిచి మోపెడు అవుతుంటుంది. వరకట్నం తీసుకోవడం నేరం.. తీసుకున్నవాడు గాడిద అని ఎన్నిసార్లు చెప్పినా.. ఇది ఆగడం లేదు. వరకట్నం మీద ప్రచారం కల్పించడానికి.. ఓ బీజేపీ నేత చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ఒక్క రూపాయి కట్నం తీసుకుని.. తన కొడుకు పెళ్లి చేశాడు ఓ బీజేపీ నేత.

Board Exams: జాతీయ విద్యా విధానం.. ఏడాదికి రెండుసార్లు టెన్త్, ఇంటర్ పరీక్షలు

పెళ్లి మండపంలో బంధువులందరి ముందు.. వధువు తండ్రి ఇచ్చిన కట్నాన్ని నిరాకరించి ఒక్క రూపాయి, కొబ్బరికాయను మాత్రమే తీసుకున్నారు. ఈ ఆదర్శ వివాహం హర్యానాలో జరిగింది. ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణ చౌకర్ కొడుకు గౌరవ్.. ఎస్‌ఐగా పని చేస్తున్నారు. గౌరవ్‌కు హరియాణా రాష్ట్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్‌ భూపాల్ సింగ్​కాదరీ కూతురు గరిమాతో పెళ్లి చేయాలని నిర్ణయించారు. వివాహ వేడుకలో బంధువులందరి ముందు వరుడికి భూపాల్ సింగ్ కట్నం ఇచ్చారు. ఐతే, ఆ కట్నాన్ని వరుడి తండ్రి కృష్ణ చౌకర్ నిరాకరించారు. బ్యాగ్‌లో నుంచి ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడు. దీంతో పెళ్లికి వచ్చిన వారందరూ వరకట్నానికి వ్యతిరేకంగా, ఆదర్శంగా నిలిచినందుకు కృష్ణ చౌకర్‌పై ప్రశంసలు కురిపించారు. వరకట్నం సమాజానికి శాపమని కృష్ణ చౌకర్ అన్నారు.

వరకట్నం తీసుకోవటం పూర్తిగా నిషేధించాలని.. వరకట్నం వ్యవస్థ పూర్తిగా తొలగిన తర్వాతే కుమారుడు, కూతుళ్ల మధ్య ఉన్న వివక్షత పోతుందని అన్నారు. ఏమైనా ఆయన చేసిన పని మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరు తండ్రులు ఇలా ఆలోచిస్తే.. వరకట్నభూతాన్ని అరికట్టడం పెద్ద మ్యాటర్ కాదు అంటూ పోస్టులు పెడుతున్నారు.