Raja Singh Lodh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం.. బీజేపీలో టెన్షన్ పుట్టిస్తోంది. హిందూ నినాదంతో గోషామహల్‌లో హ్యాట్రిక్ విజయం సాధించిన రాజాసింగ్.. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. ఐతే అక్కడి నుంచి మాధవీలతకు అవకాశం కల్పించింది బీజేపీ. దీంతో రాజాసింగ్ అసంతృప్తిగా కనిపిస్తున్నారు. ఐతే ఇప్పుడు పార్టీ కీలక మీటింగ్‌లకు రాజాసింగ్ దూరంగా ఉండడంతో.. ఆయన ఏం చేయబోతున్నారు.. కమలం పార్టీకి కటీఫ్ చెప్తారా.. రాజాసింగ్ రాంరాం అంటారా అనే చర్చ మొదలైంది.
Manchu Manoj: మంచు మనోజ్‌కు కవల పిల్లలు.. క్లారిటీ ఇచ్చిన మనోజ్
ఇలాంటి అనుమానాలు రావడానికి అలాంటి కారణాలే ఉన్నాయ్ కూడా. తన నియోజకవర్గంలో రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహించిన మీటింగ్‌కు డుమ్మా కొట్టిన రాజాసింగ్.. కేంద్రంలో నంబర్ 2 అయిన అమిత్ షా మీటింగ్‌కు కూడా రాలేదు. దీంతో రాజాసింగ్ తీరుపై ఇప్పుడు రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. గోషామహల్ అసెంబ్లీ పరిధిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయసంకల్ప యాత్ర నిర్వహించారు. దీనికి రాజాసింగ్ దూరంగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో పర్యటించిన అమిత్ షా.. గోషామహల్ అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. దీనికి కూడా రాజా సింగ్ రాలేదు. ఇలా వరుసగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటంపై రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయ్. బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత.. రాజాసింగ్ రియాక్షన్ ఇదే అంటూ కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్.
పోటీ చేయడానికి పార్టీలో ఎవరూ లేరన్నట్లు.. మాధవీలతకు టికెట్ ఇచ్చారని రాజాసింగ్ అలక వహించారంటూ.. సోషల్ మీడియాలోజరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికితోడు ఇప్పుడు.. కీలక మీటింగ్స్‌కు ఆయన దూరంగా ఉండడంతో.. వాట్ ఈజ్ దిస్ రాజా అంటూ.. సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. దీనిపై రాజాసింగ్ ఎలా రియాక్ట్ అవుతారో మరి.