BJP SECOND LIST: బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు ఖరారు

తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. ఇప్పుడు మరో ఆరుగురికి చోటు దక్కింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణ నుంచి మొత్తం 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్‌ స్థానాలను బీజేపీ పెండింగ్‌లో పెట్టింది.

  • Written By:
  • Updated On - March 13, 2024 / 07:39 PM IST

BJP SECOND LIST: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితాను భాజపా బుధవారం సాయంత్రం విడుదల చేసింది. రెండో జాబితాలో 72 మంది అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్‌, ఆదిలాబాద్‌ నుంచి గోదం నగేశ్‌, మహబూబాబాద్ నుంచి సీతారాంనాయక్, మెదక్‌ నుంచి రఘునందన్‌రావు, మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ, నల్లగొండ నుంచి సైదిరెడ్డిని అభ్యర్థులుగా ఖరారు చేసింది.

TDP SECOND LIST: టీడీపీ రెండో జాబితా రెడీ.. సీనియర్లకు మళ్లీ షాక్ తప్పదా..?

ఇంతకుముందు తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. ఇప్పుడు మరో ఆరుగురికి చోటు దక్కింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణ నుంచి మొత్తం 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్‌ స్థానాలను బీజేపీ పెండింగ్‌లో పెట్టింది. తాజా జాబితాకు సంబంధించి ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపు రావ్‌కు బీజేపీ షాక్ ఇచ్చింది. ఆయన స్థానంలో గోదం నగేశ్‌ను ఎంపిక చేసింది. మొత్తం 42 మంది టికెట్ కోసం పోటీ పడితే.. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవలే బీజేపిలో చేరిన నగేష్‌కు టికెట్ జాబితాలో చోటు దక్కడం విశేషం.

మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ పార్లమెంట్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ పడనుండగా, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ పోటీ చేస్తారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకుగాను.. కనీసం 12 సీట్లు గెలవాలని బీజేపీ అధిష్టానం లక్ష్యంగా పెట్టుకుంది.