BJP-TDP-JANASENA: టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు.. మరికొన్ని గంటల్లో క్లారిటీ..

బీజేపీ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ లోని పార్టీలు, జనంలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలో చేరడానికి తమకు 8ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. 5 ఎంపీ సీట్లు ఇస్తామంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బేరాలు ఆడుతున్నారు.

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 07:52 PM IST

BJP-TDP-JANASENA: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. కొన్నిగంటల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు సంగతి తేలిపోనుంది. ఢిల్లీ బీజేపీ పెద్దలు ఏపీ పొత్తులకు ఫైనల్ టచ్ ఇస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సోము వీర్రాజుతో సమావేశం అయ్యారు. ఇక బీజేపీ రింగులోకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేరబోతున్నారు. బీజేపీ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ లోని పార్టీలు, జనంలో ఉత్కంఠ కనిపిస్తోంది.

Telangana High Court: కోదండరాంకు షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఇప్పుడు రేవంత్ ఏం చేయబోతున్నారు.?

ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలో చేరడానికి తమకు 8ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. 5 ఎంపీ సీట్లు ఇస్తామంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బేరాలు ఆడుతున్నారు. కానీ బీజేపీ గట్టిగా అడిగితే బాబుకి కూడా ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశాలోనూ బీజేపీ తన పంతం నెగ్గించుకుంది. అక్కడ శివసేన, బీజేడీల కంటే బీజేపీయే ఎక్కువ లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ఇలాంటి డిమాండే ఆంధ్రప్రదేశ్ లోనూ టీడీపీ, జనసేనకు ఎదురు కాబోతోంది. బీజేపీ అడిగినన్ని స్థానాలు కేటాయించి.. మిగిలిన చోట్ల టీడీపీ, జనసేన పోటీ చేసే అవకాశాలున్నాయి. కమలంతో లెక్కలు తేలాకే తమ అభ్యర్థుల సెకండ్ లిస్టును రెండు పార్టీలు రిలీజ్ చేస్తాయి. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని NDAయేనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి.

అందుకే ఆ పార్టీతో వెళితేనే ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ ని తట్టుకోగలమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. లేదంటే జనం బయటకు వచ్చి ఓట్లేసే పరిస్థితి కూడా ఉండదని భయపడుతున్నారు. టీడీపీ ముఖ్య నాయకులు అందరికీ బాబు నచ్చచెబుతున్నారు. అమిత్ షా-చంద్రబాబు భేటీపై ఏపీ బీజేపీ లీడర్లు కూడా ఆసక్తి గమనిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో బీజేపీ ప్రకటించే సెకండ్ లిస్టులో ఏపీకి చెందిన అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు కూడా ఉండవచ్చని ఆశగా ఎదురు చూస్తున్నారు.