AP BJP: ఏపీలో కూటమి అభ్యర్థుల మార్పు.. పోటీ నుంచి వాళ్లంతా ఔట్‌..

ఇప్పటికే రైల్వేకోడూరులాంటి అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిని మార్చిన జనసేన.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఏలూరులాంటి స్థానంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

  • Written By:
  • Updated On - April 7, 2024 / 01:06 PM IST

AP BJP: ఏపీలో ఎన్నికల హీట్‌ పీక్స్‌కు చేరింది. మళ్లీ అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంటే.. విజయం తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నట్లుగా కూటమి పార్టీలు స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయ్. గెలుపు కోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు.. ఎలాంటి కఠినమైన నిర్ణయం అయినా తీసుకునేందుకు పార్టీలు సిద్ధం అవుతున్నాయ్. అభ్యర్థులను మార్చేందుకు కూటమి పార్టీలు ఆలోచన చేస్తున్నాయ్.

Mallu Bhatti Vikramarka: భట్టికి మళ్లీ అవమానం! తక్కుగూడలో ఇలా..

ఇప్పటికే రైల్వేకోడూరులాంటి అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిని మార్చిన జనసేన.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఏలూరులాంటి స్థానంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఇక అటు బీజేపీ కూడా ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటోంది. తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌ రావును మార్చే ఆలోచన చేస్తోంది. తిరుపతిలో ఆయనకు ఎదురవుతున్న పరిణామాలతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో వ్యతిరేకత, కుల ధృవీకరణలో లొసుగులు. ఇలా చాలా కారణాలు వరప్రసాద్‌ మీద వ్యతిరేకతకు కారణంగా మారాయ్‌. వీటన్నింటికి మించి.. కొద్దిరోజుల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది.

దీంతో వరప్రసాద్ అభ్యర్థిత్వంపై పార్టీ కేడర్‌లోనూ తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో ఆయనను మార్చడమే బెస్ట్ ఆప్షన్ అని బీజేపీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. వరప్రసాద్‌రావు స్థానంలో.. డాక్టర్‌ దాసరి శ్రీనివాసులుకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి బీజేపీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని.. మరో రెండు రోజుల్లో అభ్యర్థి మార్పునకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.