బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటోంది. అక్కడ కూడా బాహుబలి లాంటి మ్యాజిక్ జరిగే సూచనలు, రోజులు వచ్చినట్టే ఉన్నాయి. ఏదో పటాన్, లేదంటే జవాన్ హిట్టైందని అలాంటి రోజులొస్తున్నాయనలేం. ఎందుకంటే ఈ రెండు కూడాఫార్ములా మాసలా మూవీలే. కాని బాహుబలి సాలిడ్ కంటెంట్ అది కూడ భారీస్కేల్ లో వచ్చి మైండ్ బ్లాంక్ చేసిన మూవీ.
అలాంటి మ్యాజిక్ బాలీవు్డ కి సాధ్యమా అంటే సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. సీన్ లో కి యానిమల్ వచ్చేస్తోంది కాబట్టే, ఈ ప్రిడిక్షన్స్ పెరిగాయి. అప్పట్లో తెలుగు సినిమాని బాలీవుడ్ బ్యాచ్ లైట్ తీసుకునేవాళ్లు. అలాంటి టైంలో ఈగ అక్కడ పాగా వేసింది. తర్వాత బాహుబలి వచ్చి నార్త్ గేట్లు బద్దలు కొడితే, బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కేజీయఫ్ లాంటి సినిమాలు అక్కడ బుర్జ్ ఖలీఫా అంత ఎత్తుకి ఎదిగి తిష్టవేశాయి. మన హీరోలని పాన్ ఇండియా స్టార్లు గా మార్చాయి..
అచ్చంగా అలాంటి పరిస్థితి కనిపించేలా ఉంది. తెలుగు సినిమాను హిందీలో ముందు వెలిగించిన ఈగలానే, ఇప్పుడు జవాన్ కూడా ఉందంటున్నారు. ఎందుకంటే హిందీ హీరోలు ఎన్ని వేశాలేసినా, తెలుగు, తమిల్ మార్కెట్లో హిట్లు రావటం కష్టం. కాని జవాన్ తెలుగు, తమిల్ రాష్ట్రాల్లో మొదటి రోజే 9, 7 కోట్లు రాబట్టింది. ఇలాంటి రికార్డ్ క్రియేట్ అవటం ఇదే మొదలు..
ఇది తమిళ డైరెక్టర్ ఆట్లీతీశాడు కాబట్టే సౌత్ పల్స్ తెలిసినోడు ఈ ఫీట్ ని సాధ్యం చేశాడు. ఇప్పడు సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో హిందీ మూవీ యానిమల్ రాబోతోంది. అసలే అర్జున్ రెడ్డి డైరెక్టర్.అలాంటి తను కొత్త సినిమా తీశాడంటే అది పాన్ ఇండయా వయోలెంటిక్ మూవీ అంటే సౌత్ మొత్తం ఈజీగా రీచ్ అవుతుంది. కంటెంట్ ఏమాత్రం బాగున్నా, మన బాహుబలి బాలీవుడ్ మార్కెట్ బద్దలు కొట్టినట్టే, యానిమల్ వచ్చి సౌత్ మార్కెట్ గేట్లు విరక్కొట్టడం ఖాయం అంటున్నారు.