Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ పేలుడు ఉగ్రవాదుల పనేనా..? సీసీటీవీలో రికార్డైన పేలుడు దృశ్యాలు

ఘటన జరిగినప్పుడు చాలా మంది కేఫ్‌లో ఉన్నప్పటికీ.. పేలుడు తీవ్రత తక్కువగా ఉండటం వల్లే ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన వారిలో ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదు. కస్టమర్లు చేతులు కడుక్కునే ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు సమాచారం.

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 08:35 PM IST

Rameshwaram Cafe: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన పేలుడు ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఇది బాంబు పేలుడే అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులతోపాటు ఎన్‌ఐఏ, బాంబుస్క్వాడ్‌, ఐబీ, ఫోరెన్సిక్‌ నిపుణులు రంగంలోకి దిగి దర్యాప్తు జరుపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఘటన బాంబు పేలుడు వల్లే జరిగింది. రామేశ్వరం కేఫ్‌లోకి వచ్చిన ఒక వ్యక్తి బ్యాగును అక్కడ పెట్టి కౌంటర్‌లో టోకెన్‌ తీసుకున్నాడు.

BRS Chalo Medigadda: మేడిగడ్డను సందర్శించిన బీఆర్ఎస్.. చిన్న సమస్యను భూతద్దంలో చూపిస్తున్నారన్న కేటీఆర్

తర్వాత బ్యాగును అక్కడేపెట్టి వెళ్లిపోయాడు. ఆ బ్యాగ్ వదిలివెళ్లిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ప్రత్యక్షసాక్షిగా ఉన్న క్యాషియర్, ఇతర సిబ్బంది, కస్టమర్లపే పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు సిబ్బంది, కస్టమర్లు సహా తొమ్మిది మంది గాయపడ్డారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం కలగకపోవడం ఊరట కలిగిస్తోంది. ఘటన జరిగినప్పుడు చాలా మంది కేఫ్‌లో ఉన్నప్పటికీ.. పేలుడు తీవ్రత తక్కువగా ఉండటం వల్లే ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన వారిలో ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదు. కస్టమర్లు చేతులు కడుక్కునే ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రవాద కుట్రకోణం ఉందా అనేదానిపై కూడా విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటనపై పూర్తి దర్యాప్తునకు ఆదేశించామని, పరిస్తితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. మరోవైపు బెంగళూరులో పేలుడు నేపథ్యంలో తెలంగాణలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌సహా పలుచోట్ల హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.