హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ ద్వారా ఎయిర్ పోర్టులో బాంబుపెటినట్లు గుర్తించిన భద్రత సిబ్బంది ఆగంతకుడి నుంచి సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్ పోర్టులోని అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్కాడ్ ను రప్పించి బేగంపేట్ ఎయిర్ పోర్టు లోపల, బయట తనిఖీలు నిర్వహించారు. తరుచూ పొలిటికల్ వీఐపీలు ఇక్కడి నుంచే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
బేగంపేట్ విమానాశ్రయంలో బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో దాదాపు 2 గంటల పాటు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. పోలీసుల బాంబ్ స్క్కాడ్ జరిపిన తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని స్పష్టం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాయి. బాంబు బెదిరింపు ఆకతాయిలు పనిగా గుర్తించారు. దీంతో మెయిల్ పంపిన వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఇటీవల ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్, ఈ మెయిల్స్ పిల్ల చేష్టలుగా మారడంతోపోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ జరుపుతున్నారు.