Bonala festival 2024 : తెలంగాణలో మొదలైన బోనాల పండుగ.. గోల్కొండలో తొలి బోనం..

నేటి నుంచి బోనాల సందడి మొదలైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభంమయ్యాయి. ఆదివారం లంగర్‌హౌజ్‌ చౌరస్తాలో ప్రారంభమయ్యాయి.

ఆషాఢమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తెలంగాణలో జరిగే బోనాల పండుగ.. రాష్ట్ర వ్యాప్తంగా శివసత్తుల పూనకాలతో.. పోతురాజుల విన్యాసాలతో ఘటాల, ఫలహార బండ్లతో ఊరేగింపులు హైదరాబాద్ నడివోడ్డున సందడే సందడి..

నేటి నుంచి బోనాల సందడి మొదలైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభంమయ్యాయి. ఆదివారం లంగర్‌హౌజ్‌ చౌరస్తాలో ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు బోనాలను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. అక్కడి నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు గొల్కొండ కోట వరకు కొనసాగాయి. ఇక్కడ తొమ్మిది వారాలపాటు ప్రతి గురు, ఆదివారాలలో బోనాల సందడి ఉంటుంది. గోల్కొండ బోనాలకు తరలివచ్చే భక్తుల కోసం కోటలో ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోట ప్రారంభం నుంచి బోనాలు సమర్పించే ప్రాంతం దాకా తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. గోల్కొండ కోట పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం మొత్తం దేవాదాయ ఆధ్వర్యంలో జరిగింది.. బోనాల నిర్వహణ ఖర్చు కోసం ప్రభుత్వం తరఫున రూ. 11లక్షల చెక్‌ను మంత్రులు పొన్నం ప్రభాకర్ , కొండా సురేఖ, గోల్కొండ ఈవో శ్రీనివాస రాజు ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు.