Kodi Pandelu : కోడి పందేలకు బౌన్సర్లు ! గొడవలు పెట్టుకుంటే అంతే !

మీరు జిమ్ లో కష్టపడతారా.. మీకు కండలు తిరిగిన బాడీ ఉందా.. అయితే ఈ సంక్రాంతి సీజన్ కు మంచి డిమాండ్ ఉన్నట్టే. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేల నిర్వహణలో బౌన్సర్లను దించుతున్నారు నిర్వాహకులు. పందేలు జరిగే చోట వీళ్ళు ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తారు. ఎలాంటి గొడవలు జరక్కుండా చూసుకుంటారు. ఆంధ్రలో కోడిపందేలు జరిగే ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో బౌన్సర్ల రిక్రూట్ మెంట్ జరుగుతోంది.

సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, విశాఖ జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతాయి. ఈ సందర్భంగా లక్షలు, కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఒక్కో కోడిపుంజుపై లక్షల్లో బెట్టింగ్ కాసేవాళ్ళు కూడా ఉంటారు. ఒక్కోసారి గెలుస్తుందనుకున్న పందెం ఓడిపోయే ఛాన్సుంటుంది. అలాంటప్పుడు ఈ ఖరీదైన పందేల్లో భారీగా గొడవలు జరగడం.. కొట్టుకోవడం కామన్ అయింది. అందుకే ఇలాంటి గొడవలకు చెక్ పెట్టడానికి కోడిపందేల నిర్వాహకులు.. ఈసారి బౌన్సర్లను రంగంలోకి దింపుతున్నారు. వీళ్ళు ఆయా శిబిరాల దగ్గర ప్రైవేట్ సైన్యంగా కాపలా కాస్తారు. ఎవరైనా పందెంరాయుళ్ళు గొడవ పెట్టుకోవాలని అనుకున్నా.. ఈ బౌన్సర్లను చూడగానే ఠక్కున ఆగిపోయే అవకాశం ఉంటుందని నిర్వాహకులు ప్లాన్ వేశారు.

పందేల కాపలాకు బౌన్సర్ల రిక్రూట్ మెంట్ ప్రస్తుతం జరుగుతోంది. ఏపీలోని ప్రధాన జిమ్స్ కి కొన్ని నెలల ముందే సమాచారం ఇచ్చారు నిర్వాహకులు. దాంతో కొందరు యువకులను బౌన్సర్లుగా రెడీ చేశారు జిమ్స్ నిర్వాహకులు. వీళ్ళకి ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఉంది. ఏపీలో కోడిపందేలు జరిగే ప్రాంతాల్లో బౌన్సర్ల ఎన్ రోల్ మెంట్ కూడా పూర్తయింది. భీమవరంలో 70 మంది, పాలకొల్లులో 20 మంది, రాజమండ్రిలో 300 మంది, విజయవాడలో 200 మంది, విశాఖపట్నంలో 300 మంది బౌన్సర్లు ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీళ్ళను రోజువారీ వేతనంపై నియమించుకుంటారు పందేల నిర్వాహకులు. బౌన్సర్లను ముందు పెట్టి.. కొడిపందేలను నిర్వహిస్తారు. ఈసారి బరుల్లో ఎలాంటి గొడవలు తలెత్తే అవకాశం లేదంటున్నారు నిర్వాహకులు. ఇప్పటిదాకా సెలబ్రిటీలకు కాపలాగా ఉన్న బౌన్సర్ల సేవలు ఇక కోడిపందేలకు కూడా ఉపయోగపడబోతున్నాయి.