Bournvita: బోర్న్‌విటాకు కేంద్రం షాక్.. ఆ కేటగిరి నుంచి తీసేయాలని ఆదేశం

బోర్న్‌విటాకు కేంద్రం షాకిచ్చింది. బోర్న్‌విటాను హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి.. అన్ని ఈ కామర్స్ సంస్థలకు ఆదేశాలిచ్చింది. బోర్న్‌విటాతోపాటు ఇదే తరహాలో ఉండే అన్ని రకాల పానీయాలను హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తొలగించాలని సూచించింది.

  • Written By:
  • Publish Date - April 13, 2024 / 04:35 PM IST

Bournvita: బోర్న్‌విటా గురించి ఈ జనరేషన్‌లో తెలియని వాళ్లు చాలా అరుదు. ఎనర్జీ కోసం, హెల్త్ కోసం బోర్న్‌విటా పౌడర్‌ను పాలు, టీలలో కలుపుకొని తాగేస్తూ ఉంటారు. అంతగా రోజువారీ జీవితంలో భాగమైంది బోర్న్‌విటా. అయితే, ఇప్పుడు బోర్న్‌విటాకు కేంద్రం షాకిచ్చింది. బోర్న్‌విటాను హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి.. అన్ని ఈ కామర్స్ సంస్థలకు ఆదేశాలిచ్చింది.

Sonu Sood: దొంగకు సోనూసూద్ సాయం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

బోర్న్‌విటాతోపాటు ఇదే తరహాలో ఉండే అన్ని రకాల పానీయాలను హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తొలగించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సూచించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్ఎస్ఎస్) 2006 ప్రకారం.. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో వీటిని హెల్త్ కేటగిరిలో ఉంచకూడదని ఆదేశించింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీఆర్) అనే సంస్థ తెలిపిన ప్రకారం.. చట్టంలో హెల్త్ డ్రింక్ అంటూ నిర్వచించి లేదు. అందువల్ల ఈ కేటగిరిలో డ్రింక్స్ ఉంచకూడదని ఆదేశించింది. బోర్న్‌విటాతోపాటు డైరీ ప్రొడక్ట్స్, సిరియల్స్, మాల్ట్ బేస్డ్ డ్రింక్స్ వంటి వాటిని కూడా హెల్త్ డ్రింక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ కేటగిరిలో ఉంచకూడదని ఈ కామర్స్ సైట్లకు కేంద్రం సూచించింది. దేశీయ ఆహార చట్టాల ప్రకారం.. హెల్త్ డ్రింక్స్‌కు ఎలాంటి నిర్వచనం లేదు.

అలాగే.. ఎనర్జీ డ్రింక్స్ అంటే ఫ్లేవర్డ్ వాటర్ బేస్డ్ డ్రింక్స్ మాత్రమే. ఇలాంటి తప్పుడు పదాల ద్వారా వినియోగదారులు పొరపాటుపడే అవకాశం ఉంటుందని, అందువల్ల వెబ్‌సైట్లు ఆ తరహా ప్రకటనలు కూడా చేయకూడదని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. గత నెలలో ఎన్‌సీపీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగ్నో కేంద్రానికి లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బోర్నవిటాలో పరిమితికి మించి షుగర్ కంటెంట్ ఉందని నివేదికలు తేల్చాయి. ఇది తాగడం అనారోగ్యం అని నిపుణులు అంటున్నారు.