మనదేశంలో రిచెస్ట్ కమెడియన్ ఎవరనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్న కపిల్ శర్మపై, లేదంటే జానీ లీవర్, పరేష్ రావల్ లేదా రాజ్‌పాల్ యాదవ్ లాంటి సీనియర్ కమెడియన్స్ పైనో పడుతుంది. కానీ ఆ టాప్ ర్యాంకర్ మరెవరో కాదు.. మన తెలుగు హాస్య నటుడు కన్నెగంటి బ్రహ్మానందమే.
దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న బ్రహ్నానందం..!
ఎవరి కామెడీకి కడుపుబ్బ నవ్వకుండా ఉంటారో అతడే బ్రహ్మానందం. ఆయన కోసమే సినిమాలు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాదాపు 1000 చిత్రాల్లో నటించిన బ్రహ్మీ నటుడిగా ఎప్పుడో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. అలానే సినీ పరిశ్రమలో కళామ్మ తల్లికి చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు దక్కించుకున్నారు. ఇక ఇప్పటికీ దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న హాస్యనటుల్లో బ్రహ్మానందం తొలి స్థానంలో ఉన్నారు.
ఒక సినిమాకు 2 నుంచి 5 కోట్లు.. రెమ్యునరేషన్ ?
జంధ్యాల డైరెక్ట్ చేసిన అహ నా పెళ్ళంట సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన బ్రహ్మానందం ఈ చిత్రంలో అరగుండు క్యారెక్టర్ లో ఒదిగిపోయి ప్రేక్షకులకి కడుపుబ్బ ఆనందం పంచాడు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే బ్రహ్మీ ఇన్నేళ్ల కెరియర్‌లో ఎంత సంపాదించాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు బ్రహ్మీ రెమ్యునరేషన్ హీరోలతో సమానంగా ఉండేదని టాక్. ఇప్పుడు ఒక సినిమా చేస్తే రెండు కోట్ల నుంచి 5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం.
పొదుపుగా దాచికున్న ఆస్తుల విలువ అక్షరాల 450 కోట్ల.. ?
బ్రహ్మీ కోసం సెపరేట్ కామెడీ ట్రాక్స్ రాసిన డైరెక్టర్స్ కూడా ఉండగా.. తన స్క్రీన్ ప్రజెన్స్ మూవీ హిట్‌కు కారణమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 450 కోట్ల ఆస్తులు కలిగిన బ్రహ్మానందం హైదరాబాద్ మణికొండ పంచాయతీ ట్రావెల్స్ లో దాదాపు రూ.7 కోట్ల విలువైన ది ట్రయల్స్ విల్లాలో నివసిస్తున్నారు. బ్రహ్మానందం దగ్గర ఆడి R8, ఆడి Q7, బ్లాక్ లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆయన చాలా పొదుపుగా తాను సంపాదించిన డబ్బులని దాచిపెట్టి కోట్ల ఆస్తులని కలిగి ఉన్నాడు. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలలో తన కామెడితో ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్వించి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. తెలుగు వారిలోనూ బ్రహ్మీ చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆస్తులు, అంతస్తుల్లోనే కాదు.. అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు.