Assam, Heavy Floods : అస్సోంలో భారీ వర్షాలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది..

ఈశాన్య భారతదేశంలోని మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అస్సోంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలోని ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ఈశాన్య భారతదేశంలోని మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అస్సోంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలోని ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటి వరకు అస్సాం లో వరదలకు 8 మంది బలయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 16 లక్షలమంది తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తాజాగా టిన్సుకియా జిల్లాలో మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కాగా అస్సాంలో వరద పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నాయి. అక్కడ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఐజ్వాల్‌లో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. దీంతో అస్సాంలో ప్రకృతి విపత్తు వల్ల మృతుల సంఖ్య 38కి చేరింది.

ఈ వరదల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. నిన్న IAF హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు. అస్సాంలోని డిబ్రూఘర్‌లోని నదీతీర ద్వీపంలో చిక్కుకుపోయిన 12 మంది మత్స్యకారులను రెస్కూ టీం రక్షించింది. ఇక రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ధేమాజీ జిల్లా లో 300 మంది, టిన్సుకియా మరో 20 మందిని, దిబ్రూగఢ్ లోని ముగ్గురిని బోట్ల సహాయంతో రక్షించినట్లు అధికారులు తెలిపారు.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్‌ ఆర్మీ.. జూన్‌ 29 నుంచి పలు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (NDRF) సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు.

  • నీట మునిగిన కజిరంగా నేషనల్ పార్క్..

అసోం రాష్ట్రాలోని బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌ కేంద్రాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. ఒక రైనో సహా 8 జంతువులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో రెస్క్యూ టీం ధేమాజీ జిల్లాలోని పడవల ద్వారా దాదాపు వెయ్యి జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చైనా, భూటాన్, అరుణాచల్‌లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలే దీనికి కారణమని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.