బీఆర్ఎస్ పార్టీకి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. నల్గొండ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కులగోట్టాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని హైకోర్టు బీఆర్ఎస్ లాయర్ ను నిలదీసింది.
కట్టకముందు అనుమతి తీసుకోవాలి కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ప్రశ్నించిన హైకోర్టు… 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. లక్ష రూపాయల నష్టపరిహారం బిఆర్ఎస్ పార్టీ చెల్లించాలని ఈ సందర్భంగా కోర్ట్ ఆదేశించింది. కాగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించిన సంగతి తెలిసిందే.