BREAKING : సీఎల్పీ నేత ఎన్నిక రేపటికి వాయిదా ! ఇవాళ ప్రమాణ స్వీకారం లేనట్టే !!

తెలంగాణ నెక్ట్స్ సీఎం ఎవరు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎల్పీ నేత ఎన్నిక రేపటికి వాయిదా పడింది. డీకే శివకుమార్ తో సహా AICC పరిశీలకులను రేపు ఢిల్లీకి రావాలని హైకమాండ్ ఆదేశించింది.

  • Written By:
  • Updated On - December 4, 2023 / 06:36 PM IST

కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఎంపిక ప్రక్రియ రేపటికి వాయిదా పడింది.  దాంతో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రుల  ప్రమాణస్వీకార కార్యక్రమం లేనట్టే.  కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని ఢిల్లీకి పిలిపించింది AICC.  డీకేతో పాటు ఢిల్లీకి బయలుదేరిన AICC పరిశీలకులు.  రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మలిఖార్జున ఖర్గే సమక్షంలో సమావేశం జరగనుంది.  ఉదయం నుంచి ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకున్న AICC పరిశీలకులు… తమ రిపోర్టును రేపు ఖర్గేకు సమర్పించే అవకాశం ఉంది.  దాంతో సీఎల్పీ నేత ఎన్నిక కూడా రేపటికి వాయిదా పడింది. ఖర్గేతో సమావేశం తర్వాత సీఎల్పీనేత ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశముంది.