బ్రేకింగ్: వాణి 3 డిమాండ్లకు దువ్వాడ ఓకే… కానీ ఆ 2 నో…!

  • Written By:
  • Publish Date - August 14, 2024 / 07:49 AM IST

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనపడటం లేదు. సరిగా వారం రోజుల నుంచి ఆయన భార్య, కుమార్తెల నిరసన దీక్ష జరుగుతోంది. వివాదం పరిష్కారానికి మధ్యవర్తుల ద్వారా నిన్న జరిగిన చర్చలు విఫలo అయ్యాయి. వాణి వైపు నుంచి పెట్టిన ఐదు డిమాండ్లపై ఎమ్మెల్సీ నిర్ణయాన్ని నిన్న మధ్యవర్తికి శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ తెలియజేసారు. పర్లాకిమిడిలోని ఫ్యాక్టరీ, టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని నివాసాన్ని జీఎస్టీ, లోన్ క్లియర్ చేసి పిల్లల పేరిట రిజిస్టేషన్ చేయాలన్న 2డిమాండ్లపై ఎమ్మెల్సీ అంగీకరించారు.

3వ డిమాండెైన చిన్న కుమార్తె పీజీ మెడికల్ ఎడ్యుకేషన్,వివాహం ఖర్చు భరించేందుకు అంగీకారం తెలిపారు. 4వ డిమాండైన ఎమ్మెల్సీ నివాసం ఉంటోన్న ఇంటిని పిల్లల పేరున రిజిస్ట్రేషన్ చేయాలి అని… కుమార్తెలు ఇంటికి రావాలనుకున్నప్పుడు అనుమతించాలన్న డిమాండ్ కు ఎమ్మెల్సీ అంగీకరించలేదు. ఐదవ డిమాండ్ గా ఉన్న విడాకులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని శ్రీనివాస్ అంగీకరించలేదు. ఇంతవరకు వచ్చింది కాబట్టి విడాకులు ఇవ్వటమే మేలు అంటూ ఎమ్మెల్సీ సోదరుడు శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్సీ నివాసం ఉoటోన్న ఇంట్లో తాను, తన పిల్లలు అడుగు పెట్టడo ఒక్కటే తమ లక్ష్యం అని వాణీ స్పష్టం చేసారు. దాని కోసం ఎంతవరకైనా వెళ్తామని ఆమె పేర్కొన్నారు. చర్చలు విఫలం కావటంతో టెక్కలిలోని ఎమ్మెల్సీ ఇంటి వద్ద భార్య, కుమార్తెలు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం కూడా ఆరా తీసినట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్… దువ్వాడపై చర్యలకు రంగం సిద్దం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.