కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వరుస గుడ్ న్యూస్ లు చెప్తోంది. బడ్జెట్ లో అమరావతికి 15 వేల కోట్లు ఇవ్వడం అలాగే పోలవరం ప్రాజెక్ట్ ను తామే నిర్మిస్తామని స్పష్టంగా చెప్పడం ఒకటి అయితే ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినేట్. మొత్తం రూ. 28,602 కోట్లతో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ లో తెలంగాణకు 1, ఆంధ్రకు 2 కేటాయించారు. తెలంగాణలోని జహీరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ లోని ఓర్వకల్లు, కొప్పర్తిలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయనున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.