BREAKING: REVANTH CABINET :11 మంది మంత్రులతో రేవంత్ ప్రమాణం !

తెలంగాణ కొత్త మంత్రి వర్గం కొలువుదీరబోతోంది. రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తున్నారు. ఆయనతో పాటు మొత్తం 11 మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.

  • Written By:
  • Updated On - December 7, 2023 / 05:35 AM IST

తెలంగాణ కొత్త సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయబోతున్నారు. ఇవాళమధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎల్బీ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయిస్తారు. రాష్ట్ర కేబినెట్ లో మొత్తం 11 మంది మంత్రులతో ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి,
ఉపముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క

మంత్రులు:

ఉత్తమ్ కుమార్ రెడ్డి,
కోమటి రెడ్డి వెంకట రెడ్డి
శ్రీధర్ బాబు,
సీతక్క,
కొండా సురేఖ
తుమ్మల నాగేశ్వర్ రావు,
జూపల్లి కృష్ణారావు
పొన్నం ప్రభాకర్,
దామోదర రాజనర్సింహ ప్రమాణం చేస్తారని భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో ముఖ్యమంత్రి సహా 18 మంది మంత్రులుగా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ లో 30 మంది సీనియర్లు ఈ మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర పైరవీలు కూడా చేశారు. అయితే ప్రస్తుతానికి 11 మందితో మాత్రమే ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత మరో ఏడుగురికి కేబినెట్ లో ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రమాణం చేసే మంత్రులకు ఏయే శాఖలు కేటాయించలి అన్నదానిపైనా హైకమాండ్ దగ్గర తర్జన భర్జనలు జరిగాయి. మంగళవారం నాడు ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి బుధవారం కూడా అక్కడే గడిపారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చేందుకు బయల్దేరారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే మళ్ళీ వెనక్కి పిలిపించారు. ఇద్దరూ కలసి మహారాష్ట్ర భవన్ లో మరోసారి చర్చలు జరిపారు. చివరకు రాత్రి 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు రేవంత్ రెడ్డి.