మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఇప్పుడు ఏపీ సర్కార్ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిబిఐ ఈ కేసుని విచారిస్తుంది. త్వరలోనే కొందరు నిందితులను మళ్ళీ విచారించే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఈ కేసు విచారణ జరగకుండా అడ్డుకున్నారు అనే ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల చంద్రబాబు నాయుడు కలెక్టర్ ల సమావేశంలో ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సచివాలయంలో వైఎస్ సునీత ప్రత్యక్షమయ్యారు. హోంమంత్రి అనిత ను కలిసిన సునీత… తన తండ్రి హత్య పురోగతిపై హోంమంత్రితో చర్చించారు. కేసు విచారణ వేగవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అలాగే నిందితుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కూడా ఆమె విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.