Britain: నీళ్లలో అంత్యక్రియలు చేసే కొత్త టెక్నాలజీ.. మృతుని కుటుంబానికి నాలుగు గంటల్లో అస్థికలు..

పుట్టుట గిట్టుటలు సగటు మనిషికి సహజమైన ప్రక్రియ. పుట్టుకతో కొందరిని ఇబ్బందులు తలెత్తడం మామూలే. అయితే చనిపోయిన తరువాత కూడా కొన్ని దేహాలకు అసౌకర్యాలు అడుగడుగునా తలెత్తుతూ ఉంటాయి. వీటికి చెక్ పెట్టేందుకు నీటిలో అంత్యశ్రేష్ఠి సంస్కారాలను నిర్వహించేందుకు సరికొత్త పద్దుతులు వచ్చేశాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - July 5, 2023 / 04:03 PM IST

సాధారణంగా మనిషి పుట్టినా సమస్యే మరణించినా సమస్యే. పుడితే పెంపకం, పోషణ గురించి ఒక టెన్షన్. అదే చనిపోతే దహన సంస్కారాలు ఎలా చేయాలి. ఎక్కడ చేయాలి. మన సాంప్రదాయం ప్రకారం పూడ్చాలా, కాల్చాలా.. ఇలా చాలా సందేహాలు వస్తాయి. ఇదంతా కుటుంబంలోని వారి గొడవ. ఇది పక్కన పెడితే భౌతిక కాయాన్ని ఎక్కడ తీసుకెళ్లాలి. అంత్యక్రియలు ఎలా చేయాలి. ఫాలానా స్మశాన వాటికలో దహనానికి ఖాళీ ఉందా.. లేదా..? ఎవరైనా ముందుగానే బుక్ చేసుకున్నారా..? ఇలాంటి సమస్యలు దహనం చేసేవారికి సంబంధించినవి. ఇక ఖననం చేసే వారిలోనూ రకరకాలా విభిన్న పరిస్థితులు అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. చనిపోయిన వ్యక్తిని పూడ్చేందుకు తమకు సంబంధించిన బరిగెల్ గ్రౌండ్ ఎక్కడ ఉంది.? ఇది తమ పరిధిలోకి వస్తుందా.? లేక వేరే చోట ఎక్కడైనా స్థలం కేటాయించారా.? ఇన్ని వివరాలు సేకరించి చివరగా చనిపోయిన వ్యక్తిని అక్కడకి తీసుకెళ్ళాల్సి ఉంటుంది.

ఇలా కట్టెలతో కాల్చడం, మట్టిలో పూడ్చడం అనేది పురాతమైన క్రియ. ప్రస్తుతం కరెంట్ తో నిమిషాల వ్యవధిలో ఎంత మందినైనా కాల్చేసే ఆధునిక వైకుంఠధామాలు అక్కడక్కడా వెలిశాయి. మరణించిన వారి బూడిదను తమ బంధువులకు నిమిషాల వ్యవధిలో అప్పగించేలా సాంకేతికత అందుబాటిలోకి వచ్చింది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మరింత అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. దీనిని రెసోమేషన్ అంటారు. ఈ రెసోమేషన్ ప్రక్రియ పూర్తిగా నీటిలో జరుగుతుంది. తద్వారా వాతావరణ కాలుష్యానికి తావుండదు. ఈ విధానాన్ని ప్రపంచంలో చాలా దేశాలు అమలు చేస్తున్నాయి. తాజాగా బ్రిటన్ ఈ పర్యావరణానికి హాని కలిగించని ప్రయోగానికి అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే త్వరలో బ్రిటన్ వ్యాప్తంగా ఇలాంటి విధానాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది.

Britain’s scientists are ready to implement the method of Resomation

రెసోమేషన్ పనిచేయు విధానం..

నీటిని ఉపయోగించి అంత్యక్రియలు నిర్వహించడాన్ని రెసోమేషన్ పద్దతి అంటారు. ఈ పద్దతి ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని కలుగదు పూర్తి ఎకో ఫ్రెండ్లీ విధానంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేసే క్రమంలో ఎలాంటి మంటలు ఉపయోగించరు. శ్రమించి కొన్ని అడుగుల గోతిని తవ్వనవసరం లేదు. కేవలం నీటి తొట్టెలో ఉంచితే చాలు మనకు కావల్సిన అస్థికలు పొందవచ్చు. ఇలా చేసేందుకు మృతదేహాన్ని ఒక బయోడీగ్రేడబుల్ బ్యాగులో చుట్టాలి. ఆ తరువాత ఒక కంటైనర్లో 95 శాతం నీరు, 5శాతం పొటాషియం హైడ్రాక్సైడ్ కలపాలి. బ్యాగులో చుట్టిన భౌతిక కాయాన్ని ద్రావణంతో ఉన్న కంటైనర్లో ఉంచాలి. ఇలా చేయడాన్ని బాయిల్ ఇన్ ది బ్యాగ్ అంటారు. అంటే కంటైనర్ లో ఉన్న నీటిలోపల పొటాషియం హైడ్రాక్సైడ్ కలపడం వల రసాయన చర్య జరుగుతుంది. ఇలా కెమికల్ యాక్షన్ జరిగిన తరువాత చనిపోయిన వ్యక్తి శరీర భాగాలి విచ్ఛిన్నం చెందుతాయి. ఇలా విడిపోయిన తరువాత కొన్ని ద్రవాలు బయటకు విడుదల అవుతాయి. ఆ ద్రవాలు కూడా కంటైనర్లోని నీటిలో కలిసిపోతాయి. చివరగా బ్యాగులో మిగిలిపోయిన ఎముకలను పొడి చేసి మృతుని బంధువులకు అప్పగిస్తారు.

ఈ ప్రయోగం పూర్తి అయ్యేందుకు సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ పద్దతి ద్వారా అంత్యక్రియలు నిర్వహించడం వల్ల ఎలాంటి విషవాయువులు బయటకు వెలువడవు. అక్వామేషన్, ఆల్కలైన్ హైడ్రాలసిస్ అని కూడా పిలుస్తారు. ఈ విధానాన్ని అమెరికా, దక్షిణాఫ్రికా, కెనడా వంటి దేశాల్లో వినియోగిస్తున్నారు. తాజాగా బ్రిటన్ లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

తేడాలు.. ఖర్చు..

సాధారణంగా చేసే దహన సంస్కారాల్లో 245 కిలోల కార్భన్ బయటకు వెలువడుతుంది. ఇలా కొన్ని వందల దేహాలను కాల్చడం వల్ల వేల కిలోల కార్భన్ మూలకాలు గాలిలో కలిసి వాయుకాలుష్యం ఏర్పడుతుంది. అదే కొత్తగా తీసుకొచ్చిన నీటి అంత్యక్రియల వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. పైగా కాల్చేటప్పుడు వెలువడే కెమికల్స్ తో పోలిస్తే నీటి విధానంలో మూడవ వంతు తక్కువగా ఉంటుందని బ్రిటన్ కు చెందిన కో ఆప్ ఫ్యూనెలరల్ కేర్ అనే సంస్థ వెల్లడించింది. దహన, ఖనన పద్దతులతో పోలిస్తే దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ అని తెలిపింది. ఎట్టకేలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కొత్త విధానాలు సమాజంలోకి అందుబాటులోకి వచ్చాయని చెప్పాలి. వీటిని మన భారత్ లో కూడా తీసుకొని వచ్చి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇలాంటి సేవలు అందిస్తే పర్యావరణాన్ని కొంత కాపాడిన వాళ్లవుతారు. పైగా గొప్ప సంస్కారాన్ని నిర్వహించిన కీర్తి లభిస్తుందని చెప్పవచ్చు.

T.V.SRIKAR