మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.. ఇవాళ గాంధీ భవన్ లో విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ..
పాత మిత్రులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం బీజేపీ పెద్ద తప్పు చేసింది. ఉద్యమ నాయకురాలుగా, పార్లమెంట్ లో కొట్లాడిన తెలంగాణ నాయకురాలుగా ఉన్న నేను.. రాష్ట్రమే నాకు ముఖ్యమని 25 సంవత్సరాలు పనిచేశాను. కాంగ్రెస్ విడిచి బీజేపీ కి వెళ్ళడానికి కారణం ఇదే.. కేసీఆర్ అవినీతిపరుడిని లోపల వేసి చర్యలు తీసుకుంటామని ఉద్యమకారులకు బీజేపీ అధిష్టానం మాట ఇచ్చిన. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటుందని నమ్మకంతో బీజేపీ పార్టీలో లో చేరాను. కానీ బీజేపీ నెలలు ,సంవత్సరాలు గడిచిన కేసీఆర్ పై ఒక్క చర్య కూడా తీసుకోలేదు. మోడీ, అమిత్ షా, నడ్డా ని అడుగుతున్న మీరు ఎప్పుడు తెలంగాణ కి వచ్చిన కేసీఆర్ అవినీతిపరుడు, కుటుంబ పాలన అని చెప్పారు. కేసీఆర్ అవినీతి పై ఆధారాలతో సహా వారి దగ్గర ఉన్నాయి. కుటుంబ పాలన, దొంగ అని వచ్చి చెప్తారు. మోడీ గారు మీరు ప్రధాని మీకు మెజారిటీ ఉంది. మీరు కేసీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీరు చర్యలు తీసుకోలెధని ఉద్యమకారులిగా అడుగుతున్నాం. అయిన చర్యలు తీసుకోకపోవడంతో పార్టీ ఇవాళ పార్టీ మారాడు. అందుకే బీజేపీ ,బీఆర్ఎస్ ఒకటే. తెర ముందు ఒకలా..తెర వెనుకాల ఒకలా మత్లాడుతున్నారు.. మధ్యలో ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, ఉద్యమకారులు పిచ్చోళ్ళు అయ్యారు. చివరి నిమిషం వరకు యాక్షన్ తీసుకుంటారని చూసాను.. అయినా ఫలితం లేదు. అందుకే బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాను. బీజేపీ లో 4 నెలలుగా మౌనంగా ఉన్నా.
సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తుంటే అడ్డం పడింది నేనే..
సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనను ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నించాను. ఎన్నికలకు 4 నెలల ముందు అధ్యక్షుడు మారిస్తే బీజేపీ డిజస్టర్ అవుతుందని ముందుగానే చెప్పా. అయినా కూడా అధ్యక్షుడి మార్చరు చేశారు. బీజేపీ లో ఒక నాయకుడిని మొక్క నాటినట్టు నాటరు. ఆ నాయకుడు అధ్యక్షుడిని మార్చాలని పదె పదె చెప్పారు. దింతో అధిష్టానం అధ్యక్షుడిని మార్చారు. ఆ వ్యక్తి మీద అసైన్ భూముల కేసు ఏమైంది. బీజేపీ చేజేతులా వారి పార్టీ వారే నాశనం చేసుకున్నారు. తెర ముందు ఒకలా తెర వెనుకాల ఒకలా ఒప్పందం కుదిర్చుకున్నారు. కాళేశ్వరం మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. మెడిగడ్డ పిల్లర్లు కుంగిన ఎందుకు చర్యలు తీసుకోలేదు. నన్ను తిట్టే హక్కు.. బీజేపీ, బీఆర్ఎస్ లకి ఎక్కడిది. నేను డబ్బు కోసం, పదవుల కోసం లొంగే వ్యక్తిని కాదు. నా మీద ఘటైనా హెడ్ఫింగ్స్ పెట్టించారు. మా గురువు అద్వానీ గారు విలువైనా రాజకీయాలు చెప్పారు. కాని ఇప్పటి బీజేపీ నేతలకు ఇప్పుడు అలాంటి విలువలు లేవు. కొంతమంది లీడర్లు అసభ్యంగా మాట్లాడారు. వారు నోరు అదుపులో పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలి. పార్టీ నన్ను మోసం చేసింది కాని.. నేను ఎవరిని మోసం చేయలేదు.