BRS Chalo Medigadda: మేడిగడ్డను సందర్శించిన బీఆర్ఎస్.. చిన్న సమస్యను భూతద్దంలో చూపిస్తున్నారన్న కేటీఆర్

కోపం, రాజకీయ వైరం ఉంటే మాపై చూపించండి. రైతులపై కాదు. రైతులు, రాష్ట్రంపై పగ పట్టవద్దు. మేడిగడ్డను మరమ్మతులు చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 08:08 PM IST

BRS Chalo Medigadda: కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలోని బీఆర్​ఎస్​ నేతల బృందం శుక్రవారం మేడిగడ్డను సందర్శించింది. ప్రాజెక్టు సందర్శన అనంతరం కేటీఆర్, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. కోపం ఉంటే తమపై చూపించాలని, రైతులపై కాదని కేటీఆర్ అన్నారు. “కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టే నిష్ఫలమైందని దుష్ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయని ప్రచారం చేస్తున్నారు.

Rihanna: అంబానీ పెళ్ళిలో స్టార్ల సంద‌డి.. ఆ పాప్ క్వీన్‌కు రూ.70 కోట్లు రెమ్యూన‌రేష‌న్

కోపం, రాజకీయ వైరం ఉంటే మాపై చూపించండి. రైతులపై కాదు. రైతులు, రాష్ట్రంపై పగ పట్టవద్దు. మేడిగడ్డను మరమ్మతులు చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. నిపుణుల సలహాలు తీసుకుని మేడిగడ్డను పునరుద్ధరించాలని కోరుతున్నాం. వచ్చే వర్షాకాలంలోగా మరమ్మతులు పూర్తి చేయాలి. రైతులకు మాత్రం న్యాయం చేయాలి. మేడిగడ్డ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సాగు నీరు ఎత్తిపోస్తే పంటలకు లాభం చేకూరుతుంది. ఇప్పటికే సాగు నీరు లేక కరీంనగర్​లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే వస్తున్నాయి. వరద వచ్చేలోగా మేడిగడ్డలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. 1.6 కిలోమీటర్ల బ్యారేజ్‌లో 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉంది. ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదన్నట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సరికాదు.

కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు రెండుసార్లు కొట్టుకుపోయాయి. నాగార్జునసాగర్‌, శ్రీశైలంలోనూ లీకేజ్‌లు వచ్చాయి. సాగర్‌, శ్రీశైలంలో వచ్చిన లీకేజ్‌లను మేం రాజకీయం చేయలేదు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే, బీఆర్ఎస్ నేతల పర్యటన సందర్భంగా ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపుపోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. బ్యారేజ్ మెయిన్ గేట్‌ తోసుకుంటూ లోపలికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా ఉద్రిక్తతత తలెత్తింది. చివరకు వారు గేట్లు తోసుకుంటూ లోపలికి చొచ్చుకెళ్లారు. త్వరలో మిగతా బ్యారేజీలను కూడా సందర్శిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు.