KCR : కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట…

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో నిర్వహించిన రైల్‌ రోకో కేసులో ఆయన్ను A-15గా పోలీసులు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో నిర్వహించిన రైల్‌ రోకో కేసులో ఆయన్ను A-15గా పోలీసులు పేర్కొన్నారు. దీంతో కేసీఆర్ తనపై నమోదైన రైలు రోకో కేసును కొట్టివేయాలని, ఎలాంటి ఆధారాలు లేకున్న తనను నిందితుల జాబితాలో చేర్చారంటూ హైకోర్టులో సోమావారం పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ క్రమంలో విచారణపై హైకోర్టు స్టే విధించింది. 2011 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో కేసీఆర్ రైల్ రోకోకు పిలుపునిచ్చారంటూ నివేదికలో వెల్లడించారు. రైలు రోకో వల్ల ట్రైన్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు రైల్వే ఉద్యోగుల విధులకు తీవ్ర ఆటంకం కలిగిందని నివేదికలో పోలీసులు వెల్లడించారు.

తనను ఎఫ్ఐఆర్‌లో చేర్చడాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. మాల్కాజ్ గిరి పోలీసుల నివేదిక మేరకు ప్రజాప్రతినిధుల ధర్మాసనం లో మాజీ సీఎం కేసీఆర్ కేసు విచారణకు వచ్చింది. దీంతో హైకోర్టు ఇవాళ ఆయనపై విచారణపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 18కి వాయిదా వేసింది.