KCR PROBLEM : కొడుకు – కూతురు మధ్యలో కేసీఆర్.. కవిత కోసమే బీజేపీతో దోస్తీ

కొడుకు - కూతురు మధ్యలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నలిగిపోతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి... కవిత తీహార్ జైలుకెళ్ళి వంద రోజులు పూర్తయ్యాయి.

 

 

కొడుకు – కూతురు మధ్యలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నలిగిపోతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి… కవిత తీహార్ జైలుకెళ్ళి వంద రోజులు పూర్తయ్యాయి. ఆమెను ఎలాగైనా బయటకు తీసుకురావాలంటే కేంద్రంలో బీజేపీతో BRS దోస్తీ కట్టాలి. లేదంటే పార్టీని విలీనం అయినా చేయాలి. విలీనం చేయడం మాత్రం కేటీఆర్ కు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. కేసీఆర్ తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎప్పటికైనా తనకే వస్తాయి. ఎన్నో యేళ్ళుగా కాపాడుకుంటున్న ఉద్యమ పార్టీని తీసుకెళ్ళి… బీజేపీ చేతిలో పెట్టడమేంటని కేటీఆర్ కోపంగా ఉన్నారు. కానీ చెల్లెలు కోసం తప్పడం లేదు. బాపూ చెప్పినట్టు వినాలి కాబట్టి… మధ్యేమార్గంగా BRS విలీనం కాదు గానీ… పొత్తుకు ఓకే అంటూ బీజేపీ హైకమాండ్ కి సంకేతాలిచ్చారు. అందులో భాగంగానే ముందుగా తమ పార్టీ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపుతోంది BRS హైకమాండ్. ఆరు రోజులుగా ఢిల్లీలో ఉండి వచ్చిన కేటీఆర్, హరీష్ రావు… బీజేపీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారు. ఢిల్లీలో బీఎల్ సంతోష్ తో పాటు… జేపీ నడ్డాతో వీళ్ళిద్దరూ చర్చలు జరినట్టు చెబుతున్నారు.

గతంలో టీడీపీ తరహాలోనే తమ నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. BRSకు అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభ సభ్యులు ఏడుగురు ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య నాలుగుకు పడిపోయింది. జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీ కాలం ముగిసింది. అలాగే ఈమధ్యే కాంగ్రెస్ లో చేరిన కేకే… తన రాజ్యసభ ఎంపీ పదవికి రిజైన్ చేశారు. సో… ఖాళీ అయిన ఈ మూడు పదవులూ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే ఛాన్సుంది. ఇక మిగిలింది… నలుగురు మాత్రమే. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, హెటిరో పార్థసారధి రెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు రాజస్యసభ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళంతా బీజేపీలో చేరితే… బీఆర్ఎస్ రాజ్యసభా పక్షం విలీనం అయినట్టే. బీజేపీతో సత్సంబంధాలు పెంచుకోడానికి కేసీఆర్ మొదటి ప్లాన్ ఇదే అని చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుల విలీనం కార్యక్రమం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోపే పూర్తి కానుంది. అటు బీజేపీకి కూడా రాజ్యసభలో బలం కావాలి. NDA సర్కార్ కి రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ లేదు. బీజేపీకి 90మంది ఎంపీల బలం ఉంటే… NDA పార్టీలతో కలసి మొత్తం వారి సంఖ్య 125కు చేరింది. కానీ ఇండియా కూటమి బలం ఎక్కువగా ఉండటంతో… ఆ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలంటే… చిన్నా చితకా పార్టీలను చేర్చుకుంటూ బలం పెంచుకోవాలని చూస్తోంది కమలదళం.

మొదట రాజ్యసభ సభ్యుల చేరిక తర్వాత కేసీఆర్ కూడా రాజ్యసభకు పోటీ చేసి కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు చేపడతారన్న టాక్ నడుస్తోంది. ఇటు అసెంబ్లీలో కేటీఆర్ ప్రతిపక్ష నేతగా నిలబెట్టాలని ఆలోచిస్తున్నారు. కానీ కాంగ్రెస్ కేసీఆర్ కంటే వేగంగా పావులు కదుపుతోంది. వ్యవహరిస్తారు. అయితే కాంగ్రెస్ మాత్రం మరోలా ఆలోచిస్తోంది. 26 BRS ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని BRSLPని వీలనం చేసుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ మాత్రం చేసేది లేక… బీజేపీతో పొత్తు కుదిరితే కనీసం తమ MLAల వలసలకు చెక్ పెట్టొచ్చని భావిస్తోంది.