BRS 12 seats: 12 సీట్లతో ఏం పొడుస్తారు..? కేసీఆర్ మళ్ళీ చక్రం తిప్పుతారా..?

అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ తర్వాత మళ్ళీ తెలంగాణ నినాదం ఎత్తుకుంది BRS. 10 యేళ్ళు పాలించిన ఆ పార్టీ.. brsగా పేరు మార్చుకొని దేశాన్ని ఏలాలని అనుకుంది. అయితే, ఒక్క ఓటమితో అదంతా దిగిపోయింది.

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 03:48 PM IST

BRS 12 seats: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. అధికారం చేజార్చుకున్న బీఆర్ఎస్.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో పట్టుకోసం తెగ ట్రై చేస్తోంది. ఢిల్లీలో హంగ్ వస్తుంది.. 12 సీట్లు brsకు ఇస్తే.. తామే చక్రం తిప్పుతామంటూ జనాన్ని కోరుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. నిజంగా 12 సీట్లు ఇస్తే దేశ రాజకీయాలను మార్చే సీన్ కేసీఆర్‌కు ఉందా..? అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ తర్వాత మళ్ళీ తెలంగాణ నినాదం ఎత్తుకుంది BRS.

Roja defeat: వైసీపీ తొలి ఓటమి రోజాదేనా? ముందే చేతులెత్తేసిన కేడర్

10 యేళ్ళు పాలించిన ఆ పార్టీ.. brsగా పేరు మార్చుకొని దేశాన్ని ఏలాలని అనుకుంది. అయితే, ఒక్క ఓటమితో అదంతా దిగిపోయింది. ఇప్పుడు 12 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకుంటామనీ.. హైదరాబాద్ యూటీ కాకుండా కాపాడతామనీ.. గోదావరి, కృష్ణా జలాలను కేంద్రం ఎత్తుకు పోకుండా అడ్డుకుంటామని అంటున్నారు brs అధినేత కేసీఆర్. హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్, బీజేపికి ఉన్నాయని వీళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు. నదీ జలాలను ఎత్తుకు పోకుండా చూస్తామనేది మరీ విడ్డూరం. అలాంటి పనులు చేపడితే తెలంగాణలో నష్టపోయేది కాంగ్రెస్, బీజేపీయే. కానీ తెలంగాణపై శ్రద్ధ తమకే ఉన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ చెప్పుకోవడం విచిత్రంగా ఉంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను చూస్తే గోబెల్స్ మళ్ళీ పుట్టినట్టు ఉందంటూ ట్వీట్ చేశారు. BRS 10 యేళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి 9 ఎంపీ సీట్లకు మించి ఇవ్వలేదు తెలంగాణ జనం.

ఇప్పుడు పవర్ లేని పార్టీకి పన్నెండు ఇస్తారా..? ఇక కేంద్రంలో పరిస్థితి చూస్తే.. 400 సీట్లు టార్గెట్‌గా NDA వెళ్తుంటే brs మాత్రం.. ఆ కూటమికి 10, 12 సీట్లు తక్కువ పడతాయనీ.. అప్పుడు తాము చక్రం తిప్పి తెలంగాణకు నిధులు తెస్తామంటోంది. ఊహకే అందని విషయం ఇది. పైగా కేసీఆర్ ఫ్రెండ్ ఏపీ సీఎం జగన్ కూడా ఇలాంటి ఆశలే పెట్టుకున్నారు. గతంలో ఇలాగే మోడీ సర్కార్‌పై వ్యతిరేకత ఉందని అంచనాలు వేసుకున్న ప్రాంతీయ పార్టీలు బొక్కబోర్లా పడ్డాయి. ఉదాహరణకు ఏపీలో చంద్రబాబులాంటి వాళ్ళు. అలాంటిది కేసీఆర్, జగన్ కేంద్రంలో చక్రం తిప్పాలని అనుకోవడం విడ్డూరంగా ఉంది.