BRS IN SHOCK: బీఆర్ఎస్‌ నుంచి ఒకేరోజు నలుగురు జంప్‌.. కాంగ్రెస్ ఏం ఆఫర్ చేసిందంటే..

వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ అనితా రెడ్డితో పాటు.. మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు.

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 06:37 PM IST

BRS IN SHOCK: తెలంగాణలో అధికారంలో కోల్పోయి.. ప్రతిపక్షానికి పరిమితం అయిన కారు పార్టీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. నేతలంతా వరుసగా హ్యాండిస్తున్నారు. గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. కారుకు, సారుకు గుడ్‌బై అంటూ.. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. దీంతో నాయకులను కాపాడుకోవడం.. బీఆర్ఎస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకేరోజు నలుగురు నేతలు.. కారు దిగి చేయి అందుకున్నారు.

Malla Reddy: బీజేపీ, బీఆర్ఎస్‌ పొత్తు.. మిషన్ మొదలు పెట్టేశారా? మల్లారెడ్డి మాటలతో కొత్త రచ్చ..

వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ అనితా రెడ్డితో పాటు.. మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. గాంధీభవన్‌లో ఈ నలుగురికి కాంగ్రెస్ కండువా కప్పి.. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్‌ మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత వీళ్లంతా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఒకేరోజు నలుగురు నేతలు జంప్ అవడం.. ఆ లిస్ట్‌లో కీలక నేతలు ఉండడం.. బీఆర్ఎస్‌కు భారీ ఝలక్‌ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి పరిణామాలు కారు పార్టీని మరింత బలహీనం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌.. ఎలాగైనా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. దీనికోసం చేరికలను ప్రోత్సహిస్తోంది.

ఆపరేషన్ ఆకర్ష్‌ మొదలుపెట్టిన సీఎం రేవంత్‌.. కారు పార్టీ ముఖ్యనేతలపై గురిపెట్టారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ కీలక నేతలను ఆకర్షించడంపై ఫోకస్ చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై బీఆర్ఎస్‌కు ఇప్పటికీ మంచి పట్టు ఉంది. దీంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్.. అక్కడ గులాబీ పార్టీని దెబ్బ తీసే వ్యూహాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా భారీగా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఐతే లోక్‌సభ ఎన్నికల వేళ.. ఇది జస్ట్ టీజర్‌ మాత్రమే.. అసలు సినిమా ముందుండి అంటున్నాయ్ పొలిటికల్‌ వర్గాలు.