కాసేపట్లో తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. ఇక 25వ తేదీన అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శాసనసభలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమవేశంలో చర్చిస్తారు. అసెంబ్లీలో ఉద్యోగ క్యాలెండర్, నిరుద్యోగ సమస్యలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ వైఫల్యంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించనుంది. అదేవిధంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలపై… ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్సుమెంట్స్, పారిశుద్ధ్యంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ చర్చించనుంది.