BRS LIST: మరో రెండు స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన కేసీఆర్

స్థానిక బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులతో చర్చించి.. కేసీఆర్‌ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. మల్కాజ్‌గిరి టిక్కెట్ ఆశించిన మల్లారెడ్డి తనయుడు.. భద్రారెడ్డి పోటీ నుంచి తప్పుకొన్నారు.

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 08:16 PM IST

BRS LIST: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోయే మరో ఇద్దరు అభ్యర్థుల్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్య పోటీ చేయనుండగా, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ పోటీ చేయబోతున్నారు. దీంతో ఇప్పటివరకు ఆరుగురు అభ్యర్థుల్ని కేసీఆర్ ప్రకటించారు.

BJP SECOND LIST: బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు ఖరారు

గతంలో నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. మహబూబాబాద్‌ (ఎస్టీ) స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత, ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, పెద్దపల్లి (ఎస్సీ) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ఇప్పటికే ఖరారుచేశారు. మిగిలిన స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులతో చర్చించి.. కేసీఆర్‌ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.

అయితే, ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. మల్కాజ్‌గిరి టిక్కెట్ ఆశించిన మల్లారెడ్డి తనయుడు.. భద్రారెడ్డి పోటీ నుంచి తప్పుకొన్నారు. బీబీ పాటిల్ వంటి నేతలు పార్టీ వీడి బీజేపీలో చేరారు. దీంతో బీఆర్ఎస్‌కు అభ్యర్థులే దొరకడం లేదు.