Delhi Liquor Scam Kavitha : కాసేపట్లో తీహార్ జైలు నుంచి కోర్డుకు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) లో అరెస్ట అయిన బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ (MLC) కవిత.. (Kavitha) కాసేపట్లో తీహార్ జైలు ను నుండి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) లో అరెస్ట అయిన బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ (MLC) కవిత.. (Kavitha) కాసేపట్లో తీహార్ జైలు ను నుండి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. కవితను సీబీఐ నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరనుంది. ఒకవేళ కస్టడీకి కోర్టు అనుమతిస్తే.. ఆమెను తీహార్ జైలు నుంచి సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడ ప్రశ్నించే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసి విచారించగా.. ఇప్పుడు సీబీఐ కూడా రంగంలోకి దిగింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌తో కలిసి కవిత స్కామ్ చేశారని సీబీఐ చెబుతోంది. 100కోట్ల ముడుపుల చెల్లింపులో కవిత కీలకపాత్ర పోషించారని అభియోగాలు ఉన్నట్లు ఈడీ వివరించింది. ముఖ్యంగా కవిత అరెస్ట్ కు బుచ్చిబాబు ఫోన్‌ నుంచి రికవరీ చేసిన వాట్సాప్‌ చాట్‌ కీలకం అని.. దాన్నిపై సీబీఐ దృష్టి పెట్టింది. దాని ఆధారంగానే కవితను అరెస్ట్ చేశామని ఈడీ వెల్లడించింది.