Delhi Liquor Scam : BRS ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ (BRS) కల్వకుంట్ల కవితకు మరో సారి నిరాశే మిగిలింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ (BRS) కల్వకుంట్ల కవితకు మరో సారి నిరాశే మిగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలు (Tihar Jail) లో ఉన్న BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల (Kavitha) కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. ఈ నెల 6వ తేదీ వరకు బెయిల్ తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును మే 6కు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా వాయిదా వేశారు. సీబీఐ అరెస్టు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఆమె గత నెల ఏప్రిల్ 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. రౌస్ అవెన్యూ కోర్టు నేడు తీర్పును రిజర్వ్ చేసింది. ఈడీ మార్చి 15న కవితకు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమె 14 రోజుల జ్యూడిషయల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. ఇక అటు ఈడీ అరెస్ట్ చేసిన కేసులోనూ అదేరోజు తీర్పు రానుంది. దీంతో తీర్పులపై ఉత్కంఠ నెలకొంది.

SSM