Kavitha Tihar Jail: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన MLC కవితను రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కోర్టుకు పంపింది. దాంతో మంగళవారం సాయంత్రం ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తీహార్ జైలుకు తీసుకెళ్ళారు పోలీసులు. తిహార్ జైల్లో మరో ఇద్దరు ఖైదీలతో కలిపి జైల్ నెంబర్ 6 లో కవితను ఉంచారు అధికారులు. ఇంటి నుంచి ఆహారం, దిండ్లు, దుప్పట్లు, బట్టలు, బెడ్ షీట్స్, బ్లాంకెట్స్, బుక్స్, పెన్ను, పేపర్, మెడిసిన్స్ తెచ్చుకోడానికి రౌస్ అవెన్యూ కోర్టు కవితకు అనుమతి ఇచ్చింది.
Dehli Liquor Scam : కేజ్రీ భార్య సునీత సంచలన స్టేట్మెంట్
అయితే మంగళవారం రాత్రి మాత్రం జైలు అధికారులే దిండ్లు, దుప్పట్లు ఇచ్చారు. అలాగే మిగతా ఖైదీలకు ఇచ్చినట్టే అన్నం, పప్పు ఇచ్చినట్టు సమాచారం. బుధవారం ఉదయం టీ, స్నాక్స్ అందించారు. తిహార్ జైల్లో కవితకు ప్రత్యేకంగా ఏ సౌకర్యాలు కల్పించట్లేదని జైలు అధికారులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలు, జైలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. టీ, ఫుడ్, టీవీ చూడటం లాంటి టైమింగ్స్ అన్నీ జైల్లో ఇతర ఖైదీలకు లాగే కవితకూ వర్తిస్తాయన్నారు. అలాగే తిహార్ జైల్లో లైబ్రరీ ఉంది. అది అందరూ చదువుకోవచ్చు. తిహార్ ప్రిజన్ కాంప్లెక్స్ లోని జైల్ నెంబర్ 6 లో కవితతో పాటు మొత్తం 500 మంది మహిళా ఖైదీలు ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం తిహార్ జైల్లో ముగ్గురు రాజకీయ నేతలు ఉన్నారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ తో పాటు కవిత ఉన్నారు. సిసోడియా జైల్ నెంబర్ 1లో, సింగ్ జైల్ నెంబర్ 2 లో ఉన్నారు. మరో మనీ లాండరింగ్ కేసులో ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్ జైల్ నెంబర్ 7 లో ఉన్నారు.