BRS NO MONEY : చేతులెత్తేసిన BRS.. ఓటమి గ్యారెంటీతో.. డబ్బులు తీయని BRS

పార్టీ పెట్టిన పాతికేళ్లలో ఎన్నడూ చూడని అత్యంత విషాదకరమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది BRS. ఉద్యమకాలంలో కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడా తగ్గని ఆ పార్టీ... ఈ లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) దిక్కు తోచక ఏం చేయాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతుంది.

 

 

 

పార్టీ పెట్టిన పాతికేళ్లలో ఎన్నడూ చూడని అత్యంత విషాదకరమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది BRS. ఉద్యమకాలంలో కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడా తగ్గని ఆ పార్టీ… ఈ లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) దిక్కు తోచక ఏం చేయాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతుంది. సర్వేలన్నీ ఒక్క సీటు కూడా రాదని ఓపెన్ గానే చెప్పడంతో టిఆర్ఎస్ నేతలు ముందు జాగ్రత్తగా ఒక్క రూపాయి కూడా బయటకు తీయకుండా కాలం నెట్టుకోస్తున్నారు. ఓడిపోయేదానికి డబ్బులు ఎందుకు అనవసరంగా వృధా చేయడం అని చెప్పి ముందుగానే చేతులెత్తేస్తున్నారు.

తెలంగాణలో BRS దీనాతి దీనమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది ఏ సర్వే చూసినా… ఎవరితో మాట్లాడినా ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని డంకా బజాయించి మరీ చెప్తున్నారు. కార్యకర్తలు కూడా అగ్రనేతలు ముఖం మీదే ఓపెన్ గా చెప్పేస్తున్నారు. తెలంగాణలో గౌరవం కాపాడుకోవడానికి కెసిఆర్ ఈ ఎన్నికల్లో అభ్యర్థులని నిలబెట్టారు. కొన్నిచోట్ల అభ్యర్థులు కూడా దొరక్క, దారినపోయే దానయ్యలను తీసుకొచ్చి కూడా టికెట్లు ఇచ్చి పోటీలో ఉంచారు. ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం కెసిఆర్ (KCR) పార్టీ ఫండ్ నుంచి ఒక్కొక్క లోక్ సభ అభ్యర్థికి 95 లక్షలు చొప్పున ఎన్నికల ఖర్చు కోసం డబ్బులు ఇచ్చారు. ఇది అధికారికంగా ఇచ్చిన సొమ్ము మాత్రమే దాంతోపాటు ఒక్కో అభ్యర్థికి ఐదు కోట్ల మీద తెర వెనక అందించినట్లు సమాచారం. ఈ లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తుచిత్తుగా ఓడిపోతుందనీ… ఒక్క సీటు కూడా గెలవదని ఓవైపు సర్వేలు… మరోవైపు అభిప్రాయ సేకరణలు ఇంకోవైపు పార్టీ నేతలే బహిరంగంగా చెప్పేస్తున్నారు.

దీంతో అభ్యర్థులు ఎవరూ ఒక్క రూపాయి కూడా జేబులోంచి తీయకుండా… జాగ్రత్తగా కాలం నెట్టుకొస్తున్నారు. కార్యకర్తలకు కాదు కదా… మిడిల్ రేంజ్ లీడర్లకు కూడా రూపాయి దక్కటం లేదు. రెండు పూటలా కార్యకర్తలకు భోజనం పెట్టేవాడు కూడా కరువయ్యాడు. సభలకి జనాన్ని తోలడం కూడా కష్టమైపోతోంది. కెసిఆర్ దగ్గర ఎన్నికల ఖర్చు కోసం సొమ్ము తీసుకున్న లీడర్లంతా జాగ్రత్తగా దాన్ని దాచేసారని పార్టీలోనే చర్చించుకుంటున్నారు. అలాగే మరికొందరు కాంట్రాక్టర్ల నుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఎన్నికల కోసం దండుకున్న సొమ్ములు కూడా జాగ్రత్తగా దాచుకుంటున్నారు.

మెదక్.. మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ (MLC) వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy) వేల కోట్లకు అధిపతి. రాజ్ పుష్ప రియల్ ఎస్టేట్ సంస్థకు ఆయనే కళ్ళు ముక్కు చెవులు. ఈ రిటైర్డ్ IAS అధికారి పవర్ లో ఉన్నప్పుడు రెండు చేతులు రెండు కాళ్లతో సంపాదించాడనీ… వందల ఎకరాల భూములు పెట్టుకున్నాడని అందరికీ తెలిసిందే. కెసిఆర్, హరీష్ రావు బలవంతం మీద తప్పనిసరి పరిస్థితుల్లో మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న వెంకటరామిరెడ్డి ఎప్పుడెప్పుడు ఎన్నికల బరిలో నుంచి పారిపోదామా అన్నట్టు చాలా అసహనంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలకు గాని, లీడర్ల గాని ఒక్క రూపాయి కూడా ఆయన తీయడం లేదట. మీడియా వాళ్లకి టీ, కాఫీలు తాగించడానికి కూడా కోటీశ్వరుడు అయిన వెంకటరామిరెడ్డికి చేతులు రావడం లేదట. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ విషయాన్ని ఆయన్ని అడిగితే ఎలాగూ గెలిచేది లేదు, ఎందుకు టైమ్, డబ్బు వేస్ట్ చేయడం అని అంటున్నారట.

ఇలా వెంకటరామిరెడ్డి మాత్రమే కాదు తెలంగాణలో 17 మంది BRS లోక్ సభ అభ్యర్థుల పరిస్థితి ఇదే. చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar), మల్కాజ్ గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ దగ్గర్నుంచి కరీంనగర్ లో సీనియర్ లీడర్ వినోద్ కుమార్ వరకూ ఇప్పటికే ఓటమి డిసైడ్ అయిపోయింది. అందకే డబ్బు ఖర్చు పెట్టడం వృధా అనే నిర్ణయానికి వచ్చేసారు. అధిష్టానం కూడా అదే ఆలోచనతో ఉన్నట్లుంది. కేవలం పార్టీ ఉనికి కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేయాలే తప్ప గెలవలేమని కెసిఆర్ దగ్గర నుంచి… చోటా మోటా కార్యకర్త దాకా అందరికీ తెలుసు అందుకే వీలైనంతవరకు ఎక్కడ వీలైతే అక్కడ పది రూపాయలు కొట్టేసి.. దాచుకోవాలని నిర్ణయంతో ఉన్నారు అందరూ. పార్టీ అధిష్టానం ఇచ్చిన డబ్బులు కూడా జాగ్రత్తగా లాకర్లో దాచి ఎవరు వచ్చినా బీద అరుపులు అరుస్తున్నారు.

మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి కనిపించిన వారినల్లా చందాలు అడుగుతున్నారు. కొందరు BRS అభ్యర్థులు ఎన్నికలు అయిపోయే లోపు కనీసం 20 కోట్లయినా విరాళాలు, చందాలు పేరుతో వసూలు చేసుకొని… దాచుకోవాలని గట్టిగా కృషి చేస్తున్నారు. అధికారంలో ఉన్న రోజుల్లో బీఆర్ఎస్ నేతలు ఫోన్లు చేస్తే… కోట్ల రూపాయల విరాళాలు తెచ్చిపడేసే కంపెనీలు… ఇప్పుడు తుపాకీకి కూడా దొరకట్లేదు. ఫోన్ చేస్తుంటే ఊళ్లో లేవని ఇంకెక్కడో ఉన్నామని వీలు చూసుకుని తామే ఫోన్ చేస్తామని రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారట. రూపాయికి రూపాయి లెక్కేసే నామా నాగేశ్వరావు లాంటి లీడర్లు ఖమ్మం జిల్లాలో ఎలాగూ గెలవలేమని నిర్ణయానికి వచ్చేసినట్లు ఉన్నారు. కనీసం కార్యకర్తలకు భోజనాలు కూడా పెట్టడం లేదట. మొత్తం 17 మంది BRS అభ్యర్థుల పరిస్థితి ఇదే. ఎన్నికల్లో ఓడిపోవడం గ్యారంటీ అని తెలిసిన రోజు నుంచి ఎన్నికల్లో డబ్బులు ఎలా సంపాదించుకోవాలా, పది రూపాయలు ఎలా మిగుల్చుకోవాలి అనే ప్రయత్నం మీద ఉన్నారు BRS నేతలు. పాపం కేసీఆర్… కాకులు కొట్టి గద్దలు కేసినట్లు జనం దగ్గర కొట్టేసిన డబ్బుని… ఇప్పుడు ఆయన లీడర్లే మింగేస్తున్నారు.