Alampur Candidate: అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ షాక్.. ఎమ్మెల్యే అభ్యర్థిగా విజేయుడు..!

ఈ విషయంలో ఎమ్మెల్సీ చల్లా.. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అబ్రహం స్థానంలో మరొకరికి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. ఇదే సమయంలో అబ్రహం కూడా టిక్కెట్ కోసం తనవంతు ప్రయత్నాలు చేశారు. కేటీఆర్‌ను కలిసి తనకు టిక్కెట్ ఖాయం చేయాల్సిందిగా కోరారు.

  • Written By:
  • Updated On - November 8, 2023 / 04:48 PM IST

Alampur Candidate: అలంపూర్ (Alampur) సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం (Abraham)కు బీఆర్ఎస్ (BRS) షాకిచ్చింది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా విజేయుడుకు టిక్కెట్ ఇచ్చింది. కేసీఆర్ రెండు నెలల క్రితం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో సిట్టింగ్‌గా ఉన్న డాక్టర్‌ అబ్రహం పేరే ఉంది. అయితే, అనూహ్యంగా చివరి నిమిషంలో బీఫామ్‌ను విజేయుడుకు అందజేశారు కేటీఆర్. అబ్రహంకు టిక్కెట్ దక్కకపోవడానికి స్థానిక ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి కారణం అని తెలుస్తోంది. అబ్రహంకు టిక్కెట్ కేటాయించడంపై ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డితోపాటు పలువురు స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి, అభ్యర్థిని మార్చాల్సిందేనని కోరారు.

ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం.. కీలక నిబంధనలు తెలుసుకోండి..

అబ్రహంకు సహకరించబోమని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్సీ చల్లా.. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అబ్రహం స్థానంలో మరొకరికి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. ఇదే సమయంలో అబ్రహం కూడా టిక్కెట్ కోసం తనవంతు ప్రయత్నాలు చేశారు. కేటీఆర్‌ను కలిసి తనకు టిక్కెట్ ఖాయం చేయాల్సిందిగా కోరారు. అయితే, కేటీఆర్ ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. చివరకు సీఎం కేసీఆర్ సూచనతో చల్లా అనుచరుడైన విజేయుడుకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించారు. విజేయుడును హైదరాబాద్ పిలిపించుకున్న కేటీఆర్, బీఆర్ఎస్ బీఫాం అందజేశారు. దీంతో అలంపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజేయుడు బరిలో దిగనున్నారు. అంతకుముందు ఉమ్మడి మహబూబ్ నగర్‌కు సంబంధించి గత నెలలోనే 13 మంది అభ్యర్థులకు కేసీఆర్ బీఫాంలు అందజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అబ్రహం ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ టిక్కెట్ కేటాయించిన విజేయుడుకు సహకరిస్తారా.. లేక.. పార్టీకి రాజీనామా చేస్తారా అనేది చూడాలి.

Devara: భయానికి మరో కొత్త పేరు దేవర.. 150 రోజుల్లో ఊచకోత

కాగా, టిక్కెట్ దక్కని వాళ్లు నిరాశపడొద్దని, భవిష్యత్తులో అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక.. ఇప్పటివరకు పెండింగ్‌లో పెట్టిన స్థానాలకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. చాంద్రాయణ గుట్ట (ఎం సీతారాం రెడ్డి), యాకత్ పుర (సామా సుందర్ రెడ్డి), బహదూర్ పుర (ఇనాయత్ అలా బాక్రీ), మలక్‌పేట్ (తీగల అజిత్ రెడ్డి), కార్వాన్ (అయిందాల కృష‌్ణ), చార్మినార్ (సలావుద్దీన్ లోడి), నాంపల్లి (సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్) స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. దీంతో తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు అభ్యర్థుల్ని బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించినట్లైంది.