పంద్రా ఆగస్ట్ ను పురస్కరించుకొని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ అమృత్ ఉత్సవ్ పేరుతో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఇది బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు ప్రయోనకరంగా మారనుంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ను కలిగి ఉన్న వారు ఉచితంగా 100 ఎంబీపీఎస్ డేటా స్పీడ్ ను పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇలా 10 రోజుల పాటూ తమ డేటా స్పీడ్ ను పెంచుకొని వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం నెల రోజులు అంటే.. ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబరు 15 వరకూ లిమిటెడ్ టైం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అయితే బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ ను ఉపయోగించే ప్రతి ఒక్కరికీ కాకుండా కొందరికి మాత్రమే ఈ ఉచిత ఆఫర్ ను అందించనుంది. బీఎస్ఎన్ఎల్ ఎఫ్ టీటీహెచ్ జోన్ లోని కస్టమర్ల కోసమే రూపొందించింది. ప్రతి నెలా రూ. 449, రూ. 499, రూ. 599, రూ. 666 ప్యాకేజీని వాడుతున్న వారికే లబ్ధి చేకూరుతుంది అని తెలిపింది. ఈ రీచార్జ్ ప్లాన్స్ లో ఏదైనా ప్రస్తుతం వినియోగిస్తున్నట్లయితే దీనిని ఎలా ఉపయోగించాలనే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం.
T.V.SRIKAR