కారు ఇంజన్ లో కరెన్సీ కట్టలు.. మంటల్లో బూడిదైన నోట్ల కట్టలు

పోలీసుల కళ్లు గప్పి.. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు ముందు భాగంలో(ఇంజిన్‌ వద్ద) డబ్బులను అమర్చారు. డబ్బుల నోట్ల కట్టలను కారు ఇంజన్ లో ఉంచి తరలిస్తుండగా.. హీట్‌ కారణంగా కరెన్సీ నోట్లు కాలిపోయి. కారు నుంచి మంటలు, పొగ బయటకు వచ్చింది.

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇంతవరకు ప్రజలకు ఇది చేస్తాను.. ఆ పథకాలు తెస్తాను అంటూ ప్రచారం చేస్తు ఓటర్లను ఆకర్షించుకున్నారు నాయకులు. ఇప్పుడు కథ మారింది. ఇప్పుడు ఓట్ల కట్టలతో ఆకర్షించుకోనున్నారు నాయకులు. రాష్ట్రం అంతట పోలీసులు నీఘా నీడలోకి వెల్లిపోయింది. ఎక్కడ డబ్బు వాసన వచ్చిన ఇట్టే పట్టేస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పి, కళ్లు ఎన్నికల అధికారుల కళ్లు గప్పి నాయకులు డబ్బును తరలిస్తునే ఉన్నారు. పోలీసుల ముందు ఎన్ని జిమ్మిక్కులు చేసిన పోలీసుల తనిఖీలల్లో పట్టుబడుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు దాదాపు రూ.650 కోట్లకు పైగానే నగదును పోలీసులు పట్టుకున్నారు. తాజాగా ఇదే మాదిరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగా ఇక్కడ పోలీసులు పట్టుకునే ముందే డబ్బు బయట పడింది.

Telangana Assembly: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే..

తాజాగా వరంగల్ లో వినూత్న ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కళ్లు గప్పి.. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు ముందు భాగంలో(ఇంజిన్‌ వద్ద) డబ్బులను అమర్చారు. డబ్బుల నోట్ల కట్టలను కారు ఇంజన్ లో ఉంచి తరలిస్తుండగా.. హీట్‌ కారణంగా కరెన్సీ నోట్లు కాలిపోయి. కారు నుంచి మంటలు, పొగ బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. ఎన్నికలవేళ వరంగల్ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న డబ్బు అగ్నికి ఆహుతి అయింది. వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తుండగా బొల్లికుంట క్రాస్ రోడ్ వద్ద కారులో మంటలు చెలరేగాయి.

ఈ క్రమంలో, కారు నుంచి దట్టమైన పొగలు, మంటలు రావడంతో కారును అక్కడికక్కడే ఆపేసి డ్రైవర్‌ పరారయ్యాడు. అనంతరం, మరో వ్యక్తి మరో కారులో వచ్చి కాలిపోతున్న నోట్ల కట్టలను తన కారులో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక, కారులో ఉన్న డబ్బు సుమారు 30 నుంచి 50 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ఈ సీన్ మొత్తం కళ్లు మూసి తెరిచే లోపు జరిగిపోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు కారు ఎవరది? డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారన్న కోణంలో విచారణ చేపట్టినట్టు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీసీ రవీందర్ తెలిపారు.