PM-Surya Ghar Muft Bijli Yojana: 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ.. కోటి కుటుంబాలకు మోదీ కానుక

‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన’ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్ట్. దీనిలో భాగంగా రూ.75,021 కోట్ల వ్యయంతో, దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేస్తారు.

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 07:46 PM IST

PM-Surya Ghar Muft Bijli Yojana: దేశంలోని కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకానికి మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన’ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియాకు వెల్లడించారు. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

KTR VS REVANTH REDDY: మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్..

2024-25 మధ్యంతర బడ్జెట్లో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు పథకాన్ని ప్రకటించారు. ఇది సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్ట్. దీనిలో భాగంగా రూ.75,021 కోట్ల వ్యయంతో, దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేస్తారు. ఈ పథకం కింద కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీన్ని తాజాగా క్యాబినెట్ ఆమోదించింది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 1 కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్‌కు రూ.30,000, 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్‌కు రూ.60,000, 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్‌కు రూ.78,000 లేదా అంతకంటే ఎక్కువ కేంద్రం రాయితీ అందిస్తుంది. మిగిలినది తక్కువ వడ్డీతో బ్యాంకు రుణం ద్వారా పొందవచ్చు. ఈ విధానంలో రూఫ్ టాప్ సోలార్ ద్వారా అదనంగా 30 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.

ఈ పథకం ద్వారా ఇంటిపై సోలార్ రూఫ్ టాప్‌ ఏర్పాటు చేసుకుని, ఉచిత సౌర విద్యుత్ పొందవచ్చు. అంతేకాదు.. మిగులు విద్యుత్‌ను డిస్కమ్‌లకు విక్రయించి, అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ ను ప్రోత్సహించడానికి ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ విలేజ్ ను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈ పథకం కింద ఇళ్లపై సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే గృహ వినియోగదారులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://pmsuryaghar.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి ఎంపికైన వారికి సబ్సిడీ సొమ్మును నేరుగా వినియోగదారుల ఖాతాల్లో వేస్తారు.