Calcutta High Court: డార్లింగ్ అన్నారో.. ఖేల్ ఖతం.. జైలుకెళ్లాల్సిందే..

కోల్‌కతాలో ఘనంగా నిర్వహించే దుర్గామాత పూజ సందర్భంగా బందోబస్తు కోసం మహిళా పోలీసులను కూడా నియమించారు. అయితే, జనక్ రామ్ అనే వ్యక్తి.. అక్కడ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను డార్లింగ్ అని పిలిచాడు.

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 04:02 PM IST

Calcutta High Court: డార్లింగ్ అంటూ ఈమధ్య కొందరు క్యాజువల్‌గా వాడేస్తున్నారు. అయితే, బాగా తెలిసిన వాళ్లను, ఆత్మీయుల్ని డార్లింగ్ అంటే పర్లేదు. కానీ, మనకు ఏ మాత్రం తెలియని అమ్మాయిల్ని, ఆడవాళ్లను డార్లింగ్ అంటే మాత్రం ఇకపై ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఎందుకంటే తెలియని మహిళల్ని డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకు వస్తుందని తాజాగా కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చింది. అలా డార్లింగ్ అని పిలవడాన్ని సెక్షన్ 354 ఎ (1) (iv), 509 కింద అభ్యంతరకరమైన, లైంగిక పరమైన వ్యాఖ్యగా కోర్టు అభిప్రాయపడింది.

CHANDRABABU NAIDU: ఏపీ సచివాలయం తాకట్టు.. జగన్‌పై చంద్రబాబు విమర్శలు

ఈ సెక్షన్ల కింద డార్లింగ్ అని పిలిచే కేసుల్ని విచారించవచ్చని కోర్టు అభిప్రాయపడింది. కోల్‌కతాలో ఘనంగా నిర్వహించే దుర్గామాత పూజ సందర్భంగా బందోబస్తు కోసం మహిళా పోలీసులను కూడా నియమించారు. అయితే, జనక్ రామ్ అనే వ్యక్తి.. అక్కడ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను డార్లింగ్ అని పిలిచాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మహిళా కానిస్టేబుల్.. తనను డార్లింగ్ అని పిలిచిన అతడిపై మాయాబందర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేయడంతో ఇది కోల్‌కతా కోర్టులో విచారణకొచ్చింది. ఈ కేసును విచారణ జరిపిన జిల్లా జడ్జి.. డార్లింగ్ అని పిలిచిన జనక్‌ రామ్‌ను దోషిగా తేల్చారు. గతేడాది నవంబర్‌లో ఈ కేసులో అతడిని దోషిగా నిర్ధరిస్తూ, మూడు నెలల జైలుశిక్ష కూడా విధించింది. దీనిపై అతడు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు.. పరిచయం లేని మహిళను డార్లింగ్ అని పిలవడాన్ని తప్పుబట్టింది.

జనక్‌రామ్‌ విషయంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును కోల్‌కతా హైకోర్టు సమర్ధించింది. అయితే, మూడు నెలల శిక్షను నెల రోజులకు తగ్గించింది. ఈ తీర్పుపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. తెలియని మహిళను డార్లింగ్ అని పిలవడం తప్పే అయినా.. దీన్ని లైంగిక వేధింపులుగా పరిగణించాల్సిన అవసరం లేదని, అతడికి శిక్ష బదులు.. వార్నింగ్ ఇస్తే సరిపోయేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. ఒక మహిళను పిలిచే విషయంలో జాగ్రత్తగా ఉండాలిన ఈ ఉదంతం తెలియజేస్తోంది.