RADISON CASE : ఆలస్యమైతే తప్పించుకోవచ్చా? క్రిష్ గాయబ్ కి కారణం ఇదేనా…

రాడిసన్ డ్రగ్స్ కేసు (Radisson Drug Case)లో పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదరైంది. శుక్రవారం వస్తానని చెప్పిన డైరక్టర్ క్రిష్ (Director Krish) ... హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ముంబైలో షూటింగ్ బిజీలో ఉన్నందున రాలేకపోతున్నట్టు దర్యాప్తు అధికారులకు చెప్పిన క్రిష్... ఉన్నట్టుండి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించి షాక్ ఇచ్చారు.

రాడిసన్ డ్రగ్స్ కేసు (Radisson Drug Case)లో పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదరైంది. శుక్రవారం వస్తానని చెప్పిన డైరక్టర్ క్రిష్ (Director Krish) … హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ముంబైలో షూటింగ్ బిజీలో ఉన్నందున రాలేకపోతున్నట్టు దర్యాప్తు అధికారులకు చెప్పిన క్రిష్… ఉన్నట్టుండి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించి షాక్ ఇచ్చారు. క్రిష్ తనంతట తాను వచ్చే పరిస్థితి లేదని భావిస్తున్న పోలీసులు అరెస్ట్ కు సిద్ధమవుతున్నారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో తప్పించుకోవడానికే.. డైరెక్టర్ క్రిష్ ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంత ఆలస్యమైతే… బయటపడి పోవడానికి అంత ఛాన్స్ ఉంటుందని క్రిష్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.

ఫిబ్రవరి 24నాడు జరిగిన పార్టీలో క్రిష్ కొకైన్ (Cocaine) తీసుకున్నట్టు అబ్బాస్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పాడు. అందుకే కొకైన్ తీసుకున్న తర్వాత 15 రోజులు గ్యాప్ తీసుకుంటే… రక్త పరీక్షలో డ్రగ్స్ ఆనవాళ్ళు కనిపించవని భావిస్తున్నాడు క్రిష్. మిగిలిన సెలబ్రిటీలు కూడా ఇదే ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. కానీ డ్రగ్స్ తీసుకున్న తర్వాత 15 రోజులు కాదు… నెల అయినా బ్లడ్ టెస్ట్ ద్వారా పట్టుకోవచ్చని చెబుతున్నారు నార్కో నిపుణులు. అయినా డ్రగ్స్ తీసుకున్న వారిని నార్కోటిక్ యాక్ట్ ప్రకారం బాధితులుగానే పరిగణిస్తారు… వాళ్ళకి ఎలాంటి భారీ శిక్షలు ఉండవని అంటున్నారు. డ్రగ్స్ సప్లయి చేసే పెడ్లర్ కి మాత్రమే కఠిన శిక్షలు ఉంటాయని చెబుతున్నారు నార్కో నిపుణులు. మరి అది తెలుసుకోకుండా ఆలస్యం చేస్తే… దొరికే ఛాన్స్ లేదని డైరక్టర్ క్రిష్ ఎందుకు అనుకుంటున్నారో తెలియడం లేదు.

ఈ కేసులో ఇంకా శ్వేత, లిసి, నీల్, సందీప్ పరారీలోనే ఉన్నారు. నీల్ విదేశాలకు పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాడిసన్ హోటల్ యజమాని వివేకానందకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపైనా పోలీసులు దృష్టిపెట్టారు. ఈ గుట్టు విప్పేందుకు ప్రత్యేక టీమ్స్ ఎంక్వైరీ చేస్తున్నాయి. ఇప్పటికే వివేకానంద డ్రైవర్ కు డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ అలీని అరెస్టు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో మరో డ్రగ్ సరఫరాదారుడు మిర్జా వాహిద్ ను కూడా పట్టుకున్నారు. వాహిద్ డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నాడో ఆరా తీస్తున్నారు దర్యాప్తు అధికారులు. ఆయన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటి వరకు 14 మందిని నిందితులుగా చేర్చారు గచ్చిబౌలీ పోలీసులు.