రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ (Electoral Bonds) పై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు చెప్పింది. ఈ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. సీజేఐ (CJI) DY చంద్రచూడ్ (DY Chandrachud) ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది ఐదుగురు సభ్యుల ధర్మాసనం. ప్రస్తుతం ఎలక్టోరల్ బాండ్స్ ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇక నుంచి బాండ్స్ అమ్మవద్దనీ… ఇప్పటి వరకూ డొనేషన్లు తీసుకున్న రాజకీయ పార్టీలు ఆ మొత్తం తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.
రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు, బడా సంస్థలు, వ్యక్తులు ఇప్పటి దాకా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులను సమకూరుస్తున్నారు. అయితే ఎవరు ఎంత మొత్తం ఇచ్చారన్నది పార్టీలు సీక్రెట్ గా ఉంచుతాయి.
బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇలా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధుల సేకరణ… రాజకీయ పార్టీల క్విడ్ ప్రో కోకి దారి తీస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎలక్టోరల్ బాండ్స్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు సీక్రెట్ గా ఉంచడం కరెక్ట్ కాదన్నది కోర్టు. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ పరిష్కారం కాదని సుప్రీం చెప్పింది. ఎలక్టోరల్ బాండ్స్ ను సవాల్ చేస్తూ అనేకమంది సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలోనే వీటిపై విచారణ పూర్తయింది. ఇవాళ తీర్పు సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. 2019 నుంచి జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను బయటకు తెలియజేయాలని సుప్రీం ఆదేశించింది.
ఎన్నికల కమిషన్ (Election Commission), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) … ఈ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెబ్ సైట్ లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును చిన్న పార్టీల నేతలు, ప్రముఖులు స్వాగతించారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ పనులు చేయించుకోడానికి… అధికారంలో ఉన్న పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులను సమకూరుస్తున్నాయి. ఏ కంపెనీ ఎంత అమౌంట్ ఇస్తుందన్నది పార్టీలు సీక్రెట్ గా ఉంచుతున్నాయి. ఇది ఒక రకంగా లంచం కిందకే వస్తుందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
2018 నుంచి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్టోరల్ బాండ్స్ ను అమ్ముతోంది. ఆ ఒక్క ఏడాదిలో 15 వేల 956 కోట్ల రూపాయల విలువైన బాండ్స్ ను అమ్మింది. 2019 నుంచి 2022 మధ్యకాలంలో నాసిక్ లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ లో 28 వేల 531 కోట్ల రూపాయల విలువైన బాండ్లను SBI ప్రింట్ చేయించింది. ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చే కంపెనీలు లేదా సంస్థలకు నూటికి నూరుశాతం ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది. 2022-23 సంవత్సరంలో అత్యధికంగా అధికారంలో ఉన్న బీజేపీకి 719 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అందాయి. కాంగ్రెస్ కి 79 కోట్లు మాత్రమే వచ్చాయి.