Grilahakshmi scheme : గృహలక్ష్మి స్కీమ్ రద్దు.. అభయహస్తం కి అప్లై చేయాల్సిందే !

గత BRS ప్రతిపాదించిన గృహలక్ష్మి పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ రద్దు చేసింది. దాని స్థానంలో అభయహస్తం పథకాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. గత ప్రభుత్వం మంజూరు చేసిన పత్రాలు కూడా రద్దయ్యాయి. ఇక అభయహస్తం కింద ఇందిరమ్మ ఇళ్ళను తీసుకొస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

రాష్ట్రంలోని పేదలు ఇళ్ళు నిర్మించుకోడానికి వీలుగా గత BRS ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా గృహలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం కింద సొంతగా జాగా కలిగిన పేదలు ఇళ్ళు నిర్మించుకునేందుకు 3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి సాయం చేయడం కోసం BRS ప్రభుత్వం హడావిడిగా అప్లికేషన్లు స్వీకరించింది. మొత్తం 2 లక్షల 12 వేల మందికి పైగా మంజూరు పత్రాలను జారీ చేశారు. వీటిల్లో కొన్ని లబ్దిదారులకు ఇవ్వగా… మరికొన్ని ఎన్నికల కోడ్ రావడంతో ఎమ్మెల్యేల దగ్గరే ఉండిపోయాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో… గృహలక్ష్మి స్కీమ్ ను రద్దు చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు జారీ చేసిన మంజూరు పత్రాలను కూడా చెల్లుబాటు కావని ప్రకటింది.

ఈ పథకం స్థానంలో అభయహస్తం పేరుతో ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలు చేయబోతోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను లబ్దిదారులకు అందించబోతున్నారు. ఆరు గ్యారంటీల హామీలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం పథకానికి పేదలు అప్లయ్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన గృహలక్ష్మి అనుమతి పత్రాలు రద్దవడంతో… ఆ లబ్దిదారులు కూడా మళ్ళీ ఫ్రెష్ గా ఇప్పుడు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.