తిరుమల తిరుపతిలో రేపు సర్వ దర్శనం కోసం భక్తులకు జారీ చేసే టోకెన్లను టీటీడీ రద్ద చేసింది. రేపు మధ్యహ్నం నుంచి సర్వ దర్శనంన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది. ఇక పది రోజులకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలలో 4.25 లక్షల టోకేన్లు జారీ చేసేందుకు దేవస్థానం బోర్డు సన్నాహాలు చేపట్టింది. అయితే, ఎల్లుండి నుంచి జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో పది రోజులు పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల స్వీకరణను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు రద్దు చేశారు. పది రోజుల పాటు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారుల వెల్లడించారు. ఎల్లుండి ఉదయం స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇక, 24వ తేదిన వేకువ జామున పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం కొనసాగనుంది. అలాగే, పది రోజుల పాటు టోకెన్ కలిగిన భక్తులుకు మాత్రమే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు. ఆన్ లైన్ విధానంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శన టిక్కెట్లను టీటీడీ విక్రయాలు ఇప్పటికే పూర్తిగా జరిపింది. అయితే, రేపు మధ్యహ్నం నుంచి ఆఫ్ లైన్ విధానంలో సర్వ దర్శనం భక్తులకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించనుంది.