VENKATESH CASE : వెంకటేశ్ పై కుటుంబంపై కేసు.. సురేశ్ బాబు, రానాపై కోర్టు ధిక్కారం

నటుడు (Actor) వెంకటేశ్(Venkatesh), రానా దగ్గుబాటికి (Rana Daggu Bati) నాంపల్లి కోర్టులో (Nampally Court) గట్టి షాక్ తగిలింది. కోర్టు ధిక్కార కేసులో వెంకటేశ్ తో పాటు సురేష్ బాబు, రానాపై కేసులు ఫైల్ చేయాలని పోలీసులకు ఆర్డర్స్ జారీ చేసింది.

 

 

 

నటుడు (Actor) వెంకటేశ్(Venkatesh), రానా దగ్గుబాటికి (Rana Daggu Bati) నాంపల్లి కోర్టులో (Nampally Court) గట్టి షాక్ తగిలింది. కోర్టు ధిక్కార కేసులో వెంకటేశ్ తో పాటు సురేష్ బాబు, రానాపై కేసులు ఫైల్ చేయాలని పోలీసులకు ఆర్డర్స్ జారీ చేసింది. నందకుమార్ (Nandakumar) ఫిర్యాదుతోనే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఫిల్మ్ నగర్ లోని డెక్కన్ కిచెన్స్ కూల్చివేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్ళడంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఈ పిటిషన్ ఫైల్ అయింది. ఈ కేసు గురించి మాట్లాడేందుకే ఈమధ్య దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారన్న వార్తలు కూడా వచ్చాయి.

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ (Film Nagar) లో డెక్కన్ కిచెన్స్ కూల్చివేత కేసులో నటుడు వెంకటేశ్, రానా, దగ్గుబాటి సురేశ్ బాబుపై కేసు నమోదు చేయాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి… కోట్ల విలువైన బిల్డింగ్ ధ్వంసం చేశారనీ… ఫర్నిచర్ ఎత్తుకెళ్ళారని ఫిర్యాదు చేశారు నందకుమార్. నాంపల్లి క్రిమిల్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడంతో కేసు నమోదుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఐపీసీ సెక్షన్ 448, 442, 380, 506, 120బి కింద కేసులు ఫైల్ చేయాలని కోర్టు ఆదేశించింది. తనకు లీజ్ కు ఇచ్చిన భూమిని వేరేవాళ్ళకి అగ్రిమెంట్ చేసి… సురేష్ బాబు, వెంకటేశ్ మోసం చేశారని గతంలో నందకుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా రానా పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని కూడా అప్పట్లో ఆరోపణలు చేశారు.

ఈ కేసులో ఇప్పటికే వాయిదాలకు తిరుగుతున్నాడు నటుడు రానా. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫామ్ హౌజ్ కేసులో నిందితుడిగా ఉన్నారు నందకుమార్… ఈమధ్య దగ్గుబాటి ఫ్యామిలీ అంతా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వెనక ఉద్దేశ్యం కూడా ఈ కేసు గురించే అంటున్నారు. రేవంత్ ప్రమాణం చేసిన నెలన్నర దాటిన తర్వాత వీళ్ళ భేటీ జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చినందున మర్యాద పూర్వకంగానే కలిశామని దగ్గుబాటి ఫ్యామిలీ చెప్పింది. కానీ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డిని కలవకుండా సీఎంతోనే డైరెక్ట్ గా మాట్లాడంపై అప్పట్లో చర్చ నడిచింది. డెక్కన్ కిచెన్ కేసు గురించి కూడా రేవంత్ తో మాట్లాడారన్న టాక్ అప్పట్లో నడిచింది.