యూట్యూబర్ దూల తీర్చిన పోలీసులు

యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు సైబరాబాద్ పోలీసులు. డబ్బులు విసిరే వీడియోలు సోషల్ మీడియాలో యూట్యూబర్ హర్షపై పోస్ట్ చేయడంతో కేసు నమోదు చేసారు.

  • Written By:
  • Publish Date - August 23, 2024 / 11:10 AM IST

యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు సైబరాబాద్ పోలీసులు. డబ్బులు విసిరే వీడియోలు సోషల్ మీడియాలో యూట్యూబర్ హర్షపై పోస్ట్ చేయడంతో కేసు నమోదు చేసారు. రోడ్లపై డబ్బులు విసిరిస్తూ వీడియోలు రికార్డ్ చేసి టెలిగ్రామ్ లో అప్లోడ్ చేసాడు. తాను టెలిగ్రామ్ లో గంటకి వేల రూపాయలు సంపాదిస్తున్నానంటూ మీరు కూడా జాయిన్ అవ్వండి అంటూ వీడియోలు పెట్టాడు.

అలాగే వాటిని యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేస్తున్నాడు. హర్షపై సనత్ నగర్ లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు సనత్ నగర్ పోలీసులు. కేపిహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు చేసారు సైబరాబాద్ పోలీసులు. నిన్న కూకటపల్లిలో డబ్బులు గాల్లోకి విసరడంతో అక్కడ ఉన్న వారు వాటిని తీసుకోవడానికి ఎగబడ్డారు. దీనితో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. ఈ నేపధ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.