BRS Krishank: రేవంత్ సోదరుడిపై ఆరోపణలు.. BRS సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌పై కేసు !

పోలీసులు తన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారనీ.. తనకు జారీ చేసిన 41A నోటీసుల్లో, మొబైల్ సంగతి ఎందుకు వివరించలేదని ప్రశ్నించారు క్రిశాంక్. మొబైల్ ఫోన్‌లో పాస్‌వర్డ్స్ కూడా పోలీసులు బలవంతంగా ఒత్తిడి చేసి తీసుకున్నారని ఆరోపించారు.

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 01:53 PM IST

BRS Krishank: బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంత్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు అవినీతికి పాల్పడినట్టు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. చిత్రపురి సినీ వర్కర్స్ సొసైటీలో 3 వేల కోట్ల స్కామ్‌లో కోశాధికారి ఎవరో తెలుసా..? రేవంత్ సోదరుడు అనుముల మహానంద రెడ్డి అంటూ.. ఒక వీడియోని మార్చి 14న క్రిశాంక్ షేర్ చేశారు. దీనిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

CONGRESS MP SEATS: టిక్కెట్ల కోసం కాంగ్రెస్‌లో కుమ్ములాట.. లిస్టు రెడీ అయ్యేదెప్పుడు..?

ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి సోదరుడిపై పోస్ట్ పెట్టినందుకు క్రిశాంక్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు 41 A సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. చిత్రపురి హౌసింగ్ సొసైటీలో 3వేల కోట్ల అక్రమాలు జరిగినట్టు కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్‌తో పాటు ఓ యూట్యూబ్ జర్నలిస్ట్ చేసిన వీడియోను క్రిశాంక్ షేర్ చేశారు. కాంగ్రెస్ నుంచి నాంపల్లి అసెంబ్లీకి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్‌తో పాటు.. కాంగ్రెస్ పెంచి పోషించిన యూట్యూబ్ జర్నలిస్ట్ ఈ ఆరోపణలు చేశారన్నారు BRS లీడర్ క్రిశాంక్. అందువల్ల ఆ వీడియోను తాను షేర్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. పోలీసులు తన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారనీ.. తనకు జారీ చేసిన 41A నోటీసుల్లో, మొబైల్ సంగతి ఎందుకు వివరించలేదని ప్రశ్నించారు క్రిశాంక్. మొబైల్ ఫోన్‌లో పాస్‌వర్డ్స్ కూడా పోలీసులు బలవంతంగా ఒత్తిడి చేసి తీసుకున్నారని ఆరోపించారు.

గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. కేసీఆర్‌తో పాటు ఇతరులపై ఎన్నో ఆరోపణలు చేశారన్నారు క్రిశాంక్. రేవంత్ తప్పుడు ఆరోపణలు చేసినా.. అతని మొబైల్ ఫోన్‌ను.. BRS ప్రభుత్వం ఎప్పుడూ జప్తు చేయలేదని చెప్పారు. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. తన ఫోన్లు ఎందుకు జప్తు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు బీఆర్ఎస్ లీడర్ క్రిశాంక్. తమ మొబైల్స్ సీజ్ చేయడం ద్వారా ప్రైవసీకి భంగం కలిగించారనీ, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు క్రిశాంక్.