Cash deposit: డెబిట్ కార్డు లేకుండానే.. ‍యూపీఐతో సీడీఎంలలో నగదు డిపాజిట్..

యూపీఐ ద్వారా ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునే ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ మెషీన్ల (సీడీఎం)లో క్యాష్ డిపాజిట్ చేసే అవకాశం కూడా కలగనుంది. దీని ద్వారా డెబిట్ కార్డు లేకుండానే క్యాష్ డిపాజిట్ చేయొచ్చు.

  • Written By:
  • Publish Date - April 5, 2024 / 09:17 PM IST

Cash deposit: ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్‌తోనే ఇకపై క్యాష్ డిపాజిట్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను ప్రారంభించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. యూపీఐ ద్వారా ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునే ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ మెషీన్ల (సీడీఎం)లో క్యాష్ డిపాజిట్ చేసే అవకాశం కూడా కలగనుంది. దీని ద్వారా డెబిట్ కార్డు లేకుండానే క్యాష్ డిపాజిట్ చేయొచ్చు.

K KAVITHA: అటు ఈడీ, ఇటు సీబీఐ.. కవిత ఇక జైలుకే అంకితమా..?

ఈ ఫీచర్ ఎలా వాడాలంటే.. ముందుగా సీడీఎంలలో స్క్రీన్ పై కనిపించే ఆప్షన్లలో ‘యూపీఐ కార్డ్ లెస్ క్యాష్’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిపాజిట్ చేసే మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సీడీఎం స్క్రీన్‌ఫై ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లోని యూపీఐ యాప్ ద్వారా ఆ కోడ్ స్కాన్ చేయాలి. తర్వాత మీ యూపీఐ సీడీఎం డిపాజిట్‌ను ధృవీకరించడానికి మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సీడీఎంలో క్యాష్ డిపాజిట్ చేయాలి. తర్వాత ఓకే ప్రెస్ చేయాలి. దీంతో క్యాష్ డిపాజిట్ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ఇది పూర్తైన తర్వాత మీకు తగిన అలర్ట్ వస్తుంది. అయితే, ఈ విధానానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ సూచనలు త్వరలో విడుదల చేయనుంది ఆర్బీఐ.

మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ విధానం అందుబాటులోకి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఏటీఎంలు, సీడీఎంల ద్వారా బ్యాంకుల్లో సిబ్బందికి పని భారం తగ్గిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇకపై డెబిట్ కార్డులు లేకుండానే ఇలా క్యాష్ డిపాజిట్ చేసే విధానం కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.