ఎక్కడి వారు అక్కడే: ఐఏఎస్’లకు క్యాట్ షాక్

తాము ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే తాము కొనసాగేలా చూడాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులకు షాక్ తగిలింది. ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలోనే విధులు నిర్వహించాలని క్యాట్ ఆదేశించింది.

  • Written By:
  • Publish Date - October 15, 2024 / 05:37 PM IST

తాము ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే తాము కొనసాగేలా చూడాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులకు షాక్ తగిలింది. ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలోనే విధులు నిర్వహించాలని క్యాట్ ఆదేశించింది. సుపరిపాలన కోసం అధికారులను బ్యాలెన్స్ చేసేందుకు కేంద్రానికి ఎప్పుడైనా సరే నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది అని క్యాట్ స్పష్టం చేసింది.

ఒక రాష్ట్రంలో ఎక్సెస్ గా అధికారులు ఉన్నప్పుడు పక్క రాష్ట్రానికి కేటాయింపులు జరిపే అధికారం డి ఓ పి టికి ఉంటుంది అని తేల్చి చెప్పింది. ఐదుగురు ఐఏఎస్ ల కేటాయింపుల్లో ఒక్కొక్కరికి ఒక్కొ కారణం ఉన్నప్పటికీ డివోపిటిదే తుది నిర్ణయం అని క్లారిటీ ఇచ్చింది. హైకోర్టు గత ఆదేశాలలో వన్ మాన్ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పకపోయినా, కమిటీని నియమించే అధికారం డి ఓ పి టి కి ఉంటుందని తన తీర్పులో క్యాట్ స్పష్టం చేసింది. ఇక క్యాట్ తీర్పుతో అధికారులు రేపు హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు.